Mallepula Pallaki: యూట్యూబ్‌ను శాసిస్తున్న మల్లెపూల పల్లకి సాంగ్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ ప్లేస్

మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ 'ఇరుముడి' చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల జరిగిన ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ను విడుదల చేశారు.

Mallepula Pallaki: యూట్యూబ్‌ను శాసిస్తున్న మల్లెపూల పల్లకి సాంగ్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ ప్లేస్
Irumudi

Updated on: Aug 18, 2026 | 10:02 AM

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

అయ్యప్ప భక్తుల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ ‘మల్లెపూల పల్లకి’ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. ‘ఇరుముడి’ కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, పవర్‌ఫుల్ రిథమ్స్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. పాట మొదలైన వెంటనే దాని పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్ ఆకట్టుకుంటాయి. సాంప్రదాయ భక్తి భావాన్ని, రవితేజ సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీని అద్భుతంగా కలిపారు. ఒరిజినల్ పాటకు తన ప్రత్యేకమైన గొంతుతో గుర్తింపు తెచ్చుకున్న డప్పు శ్రీను మరోసారి తన వాయిస్‌తో పాటకు రా, డివోషనల్ ఫీల్ తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి బీట్‌కు తగ్గట్టుగా వేసిన ఆయన డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు పక్కా మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకు మరింత బలం చేకూర్చింది. పెద్ద సంఖ్యలో భక్తులు, సింక్రనైజ్డ్ డ్యాన్స్ మూవ్స్, గ్రాండ్ విజువల్స్‌తో పాటను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మల్లెపూల పల్లకి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. నెంబర్ వన్ లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఆడియన్స్ ఈ పాటను తెగ వింటున్నారు. థియేటర్స్ లో ఈ సాంగ్ మరింత వైబ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఆడియన్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us