
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. చేతిలో డజనుకు పైగా చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవలే స్కంద సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి ఈ బ్యూటీ..ఇప్పుడు మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఓవైపు భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇందులో బాలకృష్ణ కూతురిగా నటించింది. ఇక మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదికేశవ చిత్రంతోనే తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు శ్రీకాంత్. ఇందులో తొలిసారిగా వైష్ణవ్ సరసన నటిస్తోంది శ్రీలీల. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
‘హే బుజ్జి బంగారం’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటను యూరప్ లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల డాన్స్ తో అదరగొట్టేశారు. ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అలాగే అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఉప్పెన , కొండపొలం వంటి హిట్స్ అందుకున్న తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. గతంలో విడుదలైన సిత్తరాల సిత్రావతి అనే సాంగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలోనూ తమ స్టెప్పులతో అదరగొట్టేశారు వైష్ణవ్, శ్రీలీల.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.