టాలీవుడ్‌పై యష్ ప్రశంసలు.. ! ఆమెను చూస్తే అమ్మలా అనిపించిందన్న స్టార్ హీరో
యష్, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్న యష్.. హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ల పేర్లను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

కన్నడ స్టార్ యష్.. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ అభిమానులను సొంతం చేసుకున్న ఆయన, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న టాక్సిక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంలో యష్ కీలకమైన రావణుడి పాత్రను పోషిస్తున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ కథను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
బాబోయ్.. ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్లుకోవాల్సిందే
సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో యష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, టాలీవుడ్‌లోని ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎస్‌ఎస్ రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ ఈవెంట్‌లో యష్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను చేసిన పనిని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ప్రేమతో వచ్చారని, కొందరికి ఆ సినిమా నచ్చగా మరికొందరికి నచ్చలేదని పేర్కొన్నారు. అయితే, ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు చూపించిన ప్రేమ తనకు ఎంతో ముఖ్యమని చెప్పారు.
రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా
తెలుగు సినిమా సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు భారతీయ సినిమా ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో నిరూపించారని యష్ అన్నారు. ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని తెలుగు సినిమా కల్పించిందని, రాజమౌళి తన సినిమాలతో ఆ విషయాన్ని ప్రపంచానికి చూపించారని ప్రశంసించారు. తెలుగు చిత్ర పరిశ్రమ సాధిస్తున్న విజయాలు ఇతర భాషల సినీ ప్రముఖులకు కూడా స్ఫూర్తినిస్తున్నాయని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు గురించి కూడా యష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే దాని వెనుక బలమైన అభిరుచి, నిబద్ధత ఉన్న నిర్మాత ఉండాలని అన్నారు. దిల్ రాజు అలాంటి వ్యక్తి అని ప్రశంసించారు. సినిమా పంపిణీ విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటారని, తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా డైలాగులు, ఇతర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారని యష్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు ఆయన అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రామాయణంలో నటిస్తున్న సహనటీనటుల గురించి కూడా యష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నటనను యష్ ప్రశంసించారు. సీత పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించారని, ఆమెను చూస్తుంటే మాతృత్వ భావన కలుగుతుందని, సాయిపల్లవి అమ్మలా కనిపించిందని అన్నారు. ఇక రాముడి పాత్రలో కనిపించనున్న రణ్‌బీర్ కపూర్‌ను మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు యష్ . ఆయనకు అహంకారం లేదని, ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. రాముడిగా రణ్‌బీర్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారని యష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
