
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన ఈ రౌడీ హీరో.. ఇప్పుడు మూడు సినిమాలను లైనప్ చేశాడు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఆయా సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా సోషల్ మీడియాలో విజయ్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. షూటింగ్ గ్యాప్ లో విజయ్ ఇంట్లో నిద్రపోతున్న ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. అందులో ఏముంది అనుకునేరు. తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న ఈఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. చిన్నతనంలో తాను ఎంతో ఇష్టపడే ప్రదేశంలో, తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వర్షం కారణంగా విజయ్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఆయన కుటుంబసభ్యులతో గడపటానికి సమయం దొరికింది. కాగా ఇలా తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న ఈ ఫోటోను విజయ్ సతీమణి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తీసింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్ .. రష్మికాకు పిక్ క్రెడిట్ ఇచ్చాడు. చిన్ననాటి ఇష్టమైన ప్రదేశంలో మధ్యాహ్నం పూట ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల తన ఎనర్జీ రీఛార్జ్ అయిందని విజయ్ తెలిపాడు.
ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక తో కలిసి రణబలి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే రౌడీ జనార్దన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. వీటితో పాటు హాయ్ నాన్నతో హిట్ అందుకున్న దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.