Nikhil Siddharth: టాలీవుడ్ కుర్ర హీరో సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్

|

May 22, 2022 | 8:55 AM

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హిట్లు ఫ్లాప్ అని లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

Nikhil Siddharth: టాలీవుడ్ కుర్ర హీరో సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్
Spy
Follow us on

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) హిట్లు ఫ్లాప్ అని లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఈ కుర్ర హీరో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనున్నాడు. నిఖిల్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పై'(SPY). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె. రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకుంటుంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడా తో పాటు ఈ యాక్షన్ సెట్స్ లో మేరీ కోమ్, శకుంతలా దేవి, తాన్హాజీ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో భాగమైన బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా కనిపించారు.

హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ యాక్షన్ సన్నివేశాలను సూపర్ వైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే పాటు అభినవ్ గోమటం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. తన మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ‘స్పై’లో సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో అలరించనున్నారు నిఖిల్. పూర్తి యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, రవి ఆంథోని ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సిఈవోగా చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ