Shah Rukh Khan: నయనతారతో ప్రేమలో పడ్డారా? నెటిజన్‌ ప్రశ్నకు షారుఖ్‌ ఖాన్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారంటే?

|

Aug 11, 2023 | 6:25 AM

సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తున్నాడు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో ఛాట్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే త్వరలోనే జవాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సౌతిండియన్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ తెరకెక్కిస్తోన్న ఈ హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నయనతార కథానాయిక. విజయ్‌ సేతుపతి కీ రోల్‌లో కనిపించనున్నాడు.

Shah Rukh Khan: నయనతారతో ప్రేమలో పడ్డారా? నెటిజన్‌ ప్రశ్నకు షారుఖ్‌ ఖాన్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారంటే?
Shah Rukh Khan, Nayanthara
Follow us on

నిత్యం సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తున్నాడు. ఎంత పెద్ద స్టార్ అయినా తన అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నాడు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో ఛాట్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే త్వరలోనే జవాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సౌతిండియన్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ తెరకెక్కిస్తోన్న ఈ హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నయనతార కథానాయిక. విజయ్‌ సేతుపతి కీ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న జవాన్‌ త్వరలోనే వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మరోసారి తన అభిమానులతో సరదాగా ముచ్చటించాడు షారుఖ్‌ ఖాన్‌. ట్విట్టర్‌ వేదికగా ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు. అయితే తాజాగా ఓ అభిమాని ఓ విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ‘నయనతార మేడమ్‌తో మీరు ప్రేమలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి ‘నోరుముయ్యి. ఆమె ఇద్దరు పిల్లల తల్లి’ అని షారుఖ్ ఖాన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా జవాన్‌ సినిమా షూటింగ్ జరుగుతుండగానే విరామం తీసుకుని విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకుంది నయనతార.

నయనతార- విఘ్నేష్‌ల వివాహానికి షారుఖ్‌ ఖాన్‌ కూడా హాజరయ్యాడు. దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు తెలిపాడు. కాగా జవాన్‌ సినిమా షూటింగ్‌లో నే షారుఖ్‌- నయన్‌ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే తన కోస్టార్‌పై పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ బాద్‌షా. నయనతారతో కలిసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఆమె చాలా అందగత్తె అనీ, స్వీట్‌ పర్సన్‌ అని లేడీ సూపర్‌ స్టార్‌పై ప్రశంసలు కురిపించారు షారుఖ్‌. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్, నయనతారతో పాటు దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి కూడా నటించారు. షారుఖ్ ఖాన్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే పాటలు, పోస్టర్లు సంచలనం సృష్టించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

షారుఖ్ ఖాన్ ట్వీట్

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..