Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఏం చేస్తుందో తెలుసా?

|

Oct 05, 2024 | 3:15 PM

బాలీవుడ్ ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు హిందీ నటి అయినా తెలుగులోన ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఎక్కువగా ఉంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాళ్. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుందీ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ అక్కను చూశారా? చెల్లిని మించిన అందం.. ఏం చేస్తుందో తెలుసా?
Mrunal Thakur Family
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు హిందీ నటి అయినా తెలుగులోన ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఎక్కువగా ఉంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాళ్. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతుందీ బాలీవుడ్ ముద్దుగుమ్మ. కాగా మృణాళ్ ఠాకూర్ సినిమాల పరంగానే మనకు తెలుసు. తన ఫ్యామిలీ విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా మృణాల్ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా అంత అందంగా కనిపించడానికి కారణమెవరో తెలుసా? మృణాల్ ఠాకూర్ అక్క లోచన్ ఠాకూర్. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ గా మొదలు పెట్టిన ఆమె ప్పుడు మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మృణాల్ నటించిన అన్ని సినిమాలకు మృణాల్ పర్సనల్ మేకప్ ఆర్టిస్టుగా లోచన్ ఠాకూర్ నే పని చేస్తోంది. తెలుగులో మృణాళ్ నటించిన సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలకు కూడా లోచన్ వర్క్ చేసింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తన చెల్లిని అందంగా చూపించడంలో కీలక పాత్ర పోషించింది. కేవలం మృణాళ్ కే కాదు బాలీవుడ్ లో సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్ గా, పలువురు సెలబ్రిటీలకు కూడా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది లోచన్.

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుగా..

కాగా శుక్రవారం (అక్టోబర్ 05) లోచన్ ఠాకూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలు సందర్భాల్లో తన అక్కతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్. తన సోదరికి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం మృణాల్ షేర్ చేసిన పోస్ట్, అక్కతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమల్లో బాగా వైరలవుతున్నాయి.లోచన్ కూడా చాలా అందంగా ఉందని, హీరోయిన్ గా ట్రై చేయవచ్చని అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అక్కతో మృణాల్ ఠాకూర్..

మృణాల్, లోచన్ ల క్యూట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి