వీపుపై నటరాజు స్వామి పచ్చబొట్టు వేయించుకున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తుందండోయ్‌

|

Feb 25, 2023 | 6:18 AM

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో తన వీపుపై పచ్చబొట్టు వేయించుకుని కనిపించిందీ అందాల తార.

వీపుపై నటరాజు స్వామి పచ్చబొట్టు వేయించుకున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తుందండోయ్‌
Actress
Follow us on

పై ఫొటోలో ఉన్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. పేరుకే తమిళ్‌ అయినా తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. వెబ్‌ సిరీస్‌ల్లో నటించడంతో పాటు పలు టీవీ షోల్లో సందడి చేసింది. బిగ్‌బాస్‌షోలోనూ పాల్గొంది. ఆతర్వాత కోలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే మన రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆతర్వాత అజిత్‌, మాధవన్‌, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించింది. ప్రస్తుతం విజయ్‌ దళపతి సినిమాలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇందులో తన వీపుపై పచ్చబొట్టు వేయించుకుని కనిపించిందీ అందాల తార. అదే సమయంలో తనకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ కామెంట్లు చేసింది. ఇలా తన ట్యూటూతో వార్తల్లో నిలిచిన ఈ అందాల భామ మరెవరో కాదు.. కోలీవుడ్‌ ముద్దుగుమ్మ అభిరామి వెంకటాచలం.

గతంలోనూ..

ఇటీవల మహా శివరాత్రి రోజున శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్తూ నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అభిరామి. తాజాగా
తన వీపుపై నటరాజ స్వామి పచ్చబొట్టు వేయించుకుని మరోసారి వార్తల్లో నిలిచిందీ అందాల తార.  ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరలవుతోంది. అంతకుముందు నాగుపాము ట్యాటూను కూడా వేయించుకుంది. ఇలా బాడీపై వరుసగా పచ్చచొట్ల వేయించుకుంటూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు  సడెన్‌గా అభిరామి ఇలా మారిపోయిందేంటా? అని అయోమయానికి గురువుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్‌ దేవరకొండతో నోటా సినిమాతో కలిసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అభిరామి. ఆతర్వాత అజిత్‌తో కలిసి నెర్కొండ పార్వై ( పింక్‌ రీమేక్‌)లో నటించింది. మాధవన్‌తో కలిసి రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్‌తో కలిసి లియో సినిమాలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..