Tollywood: ఈ పాప ఎవరో గుర్తు పట్టారా? మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్ బ్యూటీగా మస్త్ క్రేజ్

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండీ హీరోయిన్. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా ఇక్కడే ఈ ముద్దుగుమ్మకు మస్త్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా టైర్-2 హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొట్టేస్తోంది. మొన్నటి వరకు హోమ్లీ బ్యూటీగా తెచ్చుకున్న ఈ అందాల తార ఈ మధ్యన గ్లామరస్ గా మారిపోయింది.

Tollywood: ఈ పాప ఎవరో గుర్తు పట్టారా? మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్ బ్యూటీగా మస్త్ క్రేజ్
Tollywood Actress
Follow us

|

Updated on: Sep 28, 2024 | 5:12 PM

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండీ హీరోయిన్. పేరుకు మలయాళ బ్యూటీనే అయినా ఇక్కడే ఈ ముద్దుగుమ్మకు మస్త్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా టైర్-2 హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొట్టేస్తోంది. మొన్నటి వరకు హోమ్లీ బ్యూటీగా తెచ్చుకున్న ఈ అందాల తార ఈ మధ్యన గ్లామరస్ గా మారిపోయింది. ఇటీవల వంద కోట్లకు పైగా రాబట్టిన ఒక మూవీలో ఈ అమ్మడు చాలా బోల్డ్ గా కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలోనూ తన ఫొటోస్ తో సెగలు రేపుతోందీ అందాల తార. అయితే ట్రెడిషినల్ లుక్ లో అయినా ట్రెండీ లుక్ లో అయినా ఎంతో అందంగా కనిపించడం ఈ అమ్మడి స్టైల్. అందుకే ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మరి ప్రస్తుతం గ్లామరస్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే చాలా మంది గుర్తు పట్టేసే ఉంటారు. యస్ ఈ క్యూటీ మరెవరో కాదు మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ఈ ఏడాది టిల్లు స్క్వేర్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అనుపమ. ఇందులో లిల్లీ పాత్ర లో అనుపమ కాస్త బోల్డ్ గా, నెగెటివ్ రోల్ లో అదరగొట్టింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.

టిల్లు స్క్వేర్‌ సినిమా తర్వాత ఓలేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్. ‘సినిమా బండి’ తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కిస్తోన్న పరదా అనే సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ అందాల తార. ఇందులో మలయాళ ప్రముఖ నటి దర్శన రాజేంద్రన్‌తో పాటు సంగీత, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన అనుపమ లుక్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. త్వరలోనే పరదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

 అనుపమా పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్..

ఓనం వేడుకల్లో అనుపమా పరమేశ్వరన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.