Tollywood: కింగ్ నాగార్జున వెనక ఉన్న వ్యక్తి గుర్తుపట్టారా ?. ఇండస్ట్రీలో తోపు

పైన ఇచ్చిన ఫోటోలో కింగ్ నాగార్జున చాలా మ్యాన్లీగా కనిపిస్తున్నారు కదా..? ఆయన వెనక ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో బడా సెలబ్రిటీ. తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: కింగ్ నాగార్జున వెనక ఉన్న వ్యక్తి గుర్తుపట్టారా ?. ఇండస్ట్రీలో తోపు
Nagarjuna
Follow us

|

Updated on: Aug 21, 2024 | 1:10 PM

పైన ఫోటోలో కింగ్ నాగ్ లుక్ కిర్రాక్ లుక్‌లో కనిపిస్తున్నాడు కదా. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన శివ సినిమాలోని ఈ స్టిల్. ఈ మూవీని ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గా భావిస్తారు. శివ సినిమాతో పాత సినిమా ఫార్మెట్‌ మార్చేశాడు ఆర్జీవీ. నాగార్జున కూడా పూర్తి మాస్ హీరోగా శివతో ఎలివేట్ అయ్యాడు. అయితే మీరు పైన చూస్తోన్న స్టిల్‌లో నాగార్జున వెనక ఉన్న వ్యక్తిని గమనించారా. అతను ఎవరో గుర్తుపట్టారా ?. ఇప్పుడు తెలుగునాట తనో ఫేమస్ సెలబ్రిటీ. ఎంతోమంది హీరోలకు డిఫరెంట్ స్టైల్, స్వాగ్ పరిచయం చేసిన సంచలన డైరెక్టర్. మరెవరో కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్. కెరీర్ తొలినాళ్లలో.. ఇలా ఓ చిన్న పాత్రలో మెరిశాడు. విలన్ రఘువరన్ బ్యాచ్‌లో ఒకరిగా కనిపించారు.

పూరీ జగన్నాథ్.. సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ ఆయన మాత్రం ఔట్ డేట్ అవ్వడు అంటారు అభిమానులు. అమితాబ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా దేశంలోని టాప్ స్టార్స్ అందిరితో సినిమాలు చేశాడు పూరి. వర్మ వద్ద దర్శకత్వ మెలుకువల నేర్చుకుని మెగాఫోన్ పట్టిన పూరి.. తన మార్క్ విజయాలతో ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా మారారు. అయితే శివ సినిమాలో ఇలా బ్యాగ్రౌండ్‌లో కనిపించారు.  ఈ చిత్రాంలోని “బోటనీ పాఠముంది” పాటలో నాగ్ తో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఈ ఫోటోను గతంలో ఎక్స్‌లో షేర్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ఫోటో మరోసారి వైరల్ అవుతోంది. తన తనయుడు ఆకాశ్‌లానే.. యుక్తవయసులో పూరి జగన్నాథ్ ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

పూరి డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తీవ్రంగా నిరాశపరిచాయి. త్వరలో ఆయన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.