తొలి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం అదృష్టం కలిసిరాలేదు. దీంతో ఒకటి రెండు చిత్రాలు చేసింది. పలు సినిమాల్లో సహయ నటిగా కనిపించింది. చాలా రోజులుగా ఈబ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 23న) ఈబ్యూటీ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ లేటేస్ట్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. తను టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తుపట్టండి.
తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లో జన్మించింది షాలిని. ఇంజనీరింగ్ పూర్తిచేసిన షాలిని.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో షాలినికి మరింత క్రేజ్ వచ్చేసింది.
అయితే ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, 118, నిశ్శబ్దం చిత్రాల్లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు చాలా కాలంగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.