ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప2లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. బ్రిలియంట్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న చిత్రం ఇది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా సునీల్, ఫహాడ్ ఫాసిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు కీలకపాత్ర పోషిస్తూ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియాట్ అయ్యింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి తో సహా యంగ్ డైరెక్టర్స్ గోపిచంద్ మలినేని, వివేక్ ఆత్రేయ, బుచ్చిబాబు అతిధులుగా హాజరయ్యారు.
దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ… “పుష్ప అనేది దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ అయిపోయింది. రాజమౌళి గారు చెప్పినట్లు పుష్ప అనేది ఒక పండుగ అయిపోయింది. నేను మూడు సంవత్సరాల క్రితం వేరే దేశానికి వెళ్ళినప్పుడు టాలీవుడ్ అని చెప్పగానే బాహుబలి అనేవారు, కానీ ఇప్పుడు పుష్ప అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే వినిపిస్తుంది. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు పుష్ప, అలాగే అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ అయిపోయారు. నేను అల్లు అర్జున్ గారిని ఎంతో దగ్గరగా చూసాను. ఈరోజు అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉండాలంటే కారణం ఆయన పట్టుదల మాత్రమే. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సుకుమార్ ఒక మాస్ కమర్షియల్ తీస్తే భారీగా ఉంటుందని. అదే ఈరోజు పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ కి ఈ సినిమా మంచి విజయం కావాలని కోరుకుంటున్నాను. పుష్ప ప్రపంచం అంతటా వైల్డ్ ఫైర్ గా హిట్ కొడుతుంది” అంటూ ముగించారు.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. సాధారణంగా సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ చేశామంటే అది ఆ సినిమా గురించి ప్రజలందరికీ తెలియాలి అని. కానీ పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప. ఈ చిత్రం పెద్ద హిట్టు కావాలని చిత్ర బృందం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అన్నారు.అలాగే వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ… “మీ అందరి ముందు ఇలా మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను అల్లు అర్జున్ గారితో కలిసి ఒక యాడ్లో పని చేయడం జరిగింది. ఒక చిన్న యాడ్ కి ఆయన ఇచ్చిన డెడికేషన్ కి నేను ఆశ్చర్యపోయాను. అలాంటిది పుష్ప లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఆయన ఎంత కష్టపడి ఉంటారో నా ఊహలు కూడా అందడం లేదు. ఈ సినిమా గురించి అల్లు అర్జున్ మాటల్లో విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని అర్థం అయింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ అంటే నా కుటుంబం లాంటివారు. నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, చెర్రీ గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.