
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో తోపు. హిందీ చిత్రపరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీరంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో వంద కోట్ల చిత్రాన్ని అందించిన తొలి నటిగా నిలిచినప్పటికీ, ఆ విజయం సాధించినా కూడా గ్లామర్ ప్రపంచానికి స్వస్తి చెప్పింది. ఆమె మరెవరో కాదు.. అసిన్ తొట్టుంకల్. 1985 అక్టోబర్‌లో జన్మించిన అసిన్, మలయాళం, తమిళం, తెలుగు, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. 2001లో, కేవలం 15 ఏళ్ల వయసులో, సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహించిన ‘నరేంద్రన్ మకన్ జయకాంతన్ వాక’ చిత్రంతో ఆమె నటిగా అరంగేట్రం చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
సూర్య నటించిన గజిని సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ప్రభాస్ జోడిగా చక్రం, పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం వంటి చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలో ఆమె నటించిన గజిని చిత్రం ఆమె కెరీర్ మార్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రంగా ‘గజినీ’ నిలిచింది. ఆ తర్వాత ఆమె ‘రెడీ’, ‘బోల్ బచ్చన్’, ‘ఖిలాడీ 786’ వంటి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
2016లో మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత, అసిన్ గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఈ దంపతులకు 2017లో అరిన్ అనే కుమార్తె జన్మించింది. రాహుల్ శర్మ ఒక విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు, అతని నికర ఆస్తి విలువ రూ.1300 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అసిన్.
ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
Asin Fam
ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..