అప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఇప్పుడు ఆటో నడుపుకుంటూ ఇలా..! ఈ నటుడిని గుర్తుపట్టారా.?
చిత్రసీమలో చాలా మంది నటులు సున్నా నుండి మొదలుపెట్టి విజయం సాధించారు. కష్టాలను అధిగమించి నటుడిగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులు సైతం ఫేమస్ అవుతుంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.?

సినిమా గ్లామర్ ప్రపంచంలో వెలుగు జిలుగుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. సున్నా నుంచి మొదలై స్టార్స్‌గా వెలిగినవారు ఎంతమంది ఉన్నారో, అద్భుతమైన నటనతో మెప్పించి కూడా ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నటీనటులు అంతేమంది ఉన్నారు. స్టార్ హీరోలకు ధీటుగా సహాయ పాత్రల్లో జీవించి, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటుల జీవితాలు కూడా ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. అలాంటి ఓ నటుడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అతనే తమిళ నటుడు మరిముత్తు. 2008లో ఎం. శశికుమార్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం సుబ్రహ్మణ్యపురం ఇదే సినిమా తెలుగులో అనంతపురం పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో మరిముత్తు కీలక పాత్రలో నటించారు. జై, శశికుమార్, సముద్రకని, స్వాతి, గంజా కరుప్పు వంటి నటీనటులతో కలిసి ఆయన తన సహజ నటనతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా, మరిముత్తుకు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. మంచి క్యారెక్టర్, కామెడీ రోల్స్ వస్తాయని భావించినప్పటికీ పరిస్థితి భిన్నంగా మారింది. అవకాశాల కోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన దొరికిన పని చేసుకుంటూ జీవితంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నారు.
సినిమా అవకాశాలు తగ్గడంతో తన పాత వృత్తి అయిన రేడియో రిపేరింగ్, ఎలక్ట్రికల్ పనులు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత జీవనోపాధి కోసం ఆటో నడపడం నేర్చుకుని, ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన కార్తీకను ఆయన వివాహం చేసుకున్నారు. ఇటీవల మరిముత్తు ఆటో నడుపుతూ, ఆటోలు రిపేర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన నటుడు, నేడు జీవనం కోసం ఆటో నడుపుతుండటం చూసి పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు. కష్టాలొచ్చినా కుంగిపోకుండా గౌరవంగా శ్రమించి జీవిస్తున్న మరిముత్తు మనోధైర్యాన్ని అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
