స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ధనుష్ పై స్టార్ హీరోయిన్ నయనతార చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తన వెడ్డింగ్ వీడియోలో ఓ సినిమానుంచి మూడు సెకండ్ వీడియోను వాడుకున్నందుకు రూ. 10కోట్లు డిమాండ్ చేశాడంటూ నయన్ సోషల్ మీడియాలో ఓ లేఖలో పేర్కొన్నారు. దాంతో ధనుష్ పై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు నయన్ కు మద్దతుగా స్టార్ హీరోయిన్స్ ఆమె పోస్ట్ ను లైక్ చేస్తున్నారు. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్, ఐశ్వర్య లక్ష్మీ, దియా మీర్జా, ఏక్తా కపూర్, నజ్రియా నజీమ్ ఇలా పలువురు నయన్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ అన్న గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ధనుష్ అన్న పేరు సెల్వరాఘవన్.
సెల్వరాఘవన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ్ లో పుదుపేట్టై, మాయాక్కం లాంటి సినిమాతో పాపులర్ అయ్యారు సెల్వరాఘవన్. ఇక 7G బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సెల్వ. ఇక ఈ టాలెంటడ్ డైరెక్టర్ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సెల్వరాఘవన్ నటుడిగాను మెప్పించారు. చాలా సినిమాల్లో ఆయన సహాయక పాత్రల్లో నటించాడు. కాగా ఈ స్టార్ దర్శకుడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సెల్వరాఘవన్ మొదటి భార్య ఎవరో తెలుసా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్. ఆమె మరెవరో కాదు. 7G బృందావన్ కాలనీ సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్. 7G బృందావన్ కాలనీ సినిమా తర్వాత ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సోనియా అగర్వాల్ ను డిసెంబరు 2006 న వివాహం చేసుకున్నారు సెల్వ. తర్వాత సోనియా సినిమాల్లో నటించడం మానేసింది. అయితే ఈ జంట 2009 ఆగస్టులో విడిపోయారు.ఆ తరువాత జూన్ 19, 2011న తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ పి. ఎస్. రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.