
సినిమా విజయం ఎప్పుడూ థియేటర్ల కలెక్షన్లతోనే నిర్ణయించబడదు. కొన్ని సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంటాయి. అలా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి ఓటీటీల్లో హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు టాప్ లో ట్రెండ్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన ‘సర్దార్ 2’ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా కార్తీ అభిమానులతో పాటు యాక్షన్, స్పై థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారు ఈ సినిమాను డిజిటల్‌లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ 2 సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు సుమారు రూ.23.85 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో థియేట్రికల్ రన్ ముగిసిన కొద్ది రోజులకే మేకర్స్ సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సర్దార్ 2 స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అంటే థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు 21 రోజులకే డిజిటల్ ప్రీమియర్ జరిగింది.
ఓటీటీ రిలీజ్‌తో సర్దార్ 2కు మరో ప్లస్ పాయింట్ లభించింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తమకు నచ్చిన భాషలో ఇంటి నుంచే సినిమాను చూసే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రాజిషా విజయన్ తదితరులు నటించారు. సర్దార్ ఫ్రాంచైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన కార్తీ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఒకవైపు స్పై ఏజెంట్ సర్దార్‌గా, మరోవైపు ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా ఆయన కనిపిస్తారు. ప్రస్తుతం సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రెండ్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.