Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి ఫోక్ సాంగ్స్.. సినిమా పాటలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఫోక్ సాంగ్స్. తెలంగాణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్ విడుదలయ్యాయి. తెలంగాణ యాసతో సాంగ్ సాంగ్స్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఈ సాంగ్స్.

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?
Rathiri Rathirilo Song

Updated on: Aug 20, 2026 | 9:16 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోక్ సాంగ్ తెగ వైరల్ అవుతూంటుంది. రీసెంట్ డేస్‌లో జానపద గీతాలు సినిమా పాటలను మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వారానికి ఒకటి రెండు సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఎంఈ సాంగ్స్ మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎక్కడ చూసిన ఇవే సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. వినే కొద్దీ వినాలనిపించేలా సాంగ్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరూ ఈ సాంగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఈ పాటలు తెగ సందడి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ జరుగుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ గురించి రీల్స్, పోస్ట్ లు అంతలా ఈ సాంగ్ ఎందుకు వైరల్ అవుతుంది. అసలు ఈ సాంగ్ లో ఏముందో ఒక్కసారి చూద్దాం. యూట్యూబ్ లో చాలా ఫోక్ సాంగ్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్.. అది మరేదో కాదురాతిరి రాతిరి సాంగ్. ఈ సాంగ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకట్టుకునే లవ్ కాన్సెప్ట్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు. ఈ రాతిరి రాతిరి సాంగ్‌లో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు, డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ ను సంతోష్, ప్రశాంత్ అద్భుతంగా రచించారు. కృష్ణుడు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఉష అక్క, నరసిమ్ములు ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఇన్ స్టా గ్రామ్ ను కూడా ఊపేస్తోంది. ఈ క్రేజీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సాంగ్ లో నటించిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ అడ్డంగా దొరికారు. ఓ హోటల్ లో రాసలీలలు సాగిస్తున్న ఇద్దరినీ ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాంతో ఈ యవ్వారం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ నటించిన రాతిరి సాంగ్ మరోసారి నెట్టింట వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us