AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: మోహన్ బాబుకు జోడిగా హాట్ బ్యూటీ..! బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటివరకు 500 కు పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన నటనా ప్రతిభతో అభిమానుల చేత కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలిపించుకున్నారు.

Mohan Babu: మోహన్ బాబుకు జోడిగా హాట్ బ్యూటీ..! బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా
Mohan Babu
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 2:05 PM

Share

మంచు మోహన్ బాబు.. ఇప్పుడంటే ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు కానీ ఒకప్పుడు మోహన్ బాబు అంటే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్. మోహన్ బాబు సినిమాలకు ఉండే క్రేజే వేరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. డైలాగ్స్ చెప్పడంలో ఆయనతో ఓ ప్రత్యేక శైలి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు ఆతర్వాత హీరోగా ఎదిగారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు మోహన్ బాబు. ఫ్యామిలి ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా తన నటనతో మెప్పించారు కలెక్షన్ కింగ్. రీసెంట్ గా కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు ఆయన కేరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో నటించారు. అయితే ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆయన నటించారు.

ఇది కూడా చదవండి :ఏం సినిమా రా అయ్యా..! అమ్మాయిలను మాత్రమే చంపే కిల్లర్.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు

అయితే ఆ హీరోయిన్ ఎవరో మీరు అస్సలు ఊహించలేరు. బాలీవుడ్ లో ఇప్పటికి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె.. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. అవును మోహన్ బాబు సరసన బాలీవుడ్ అందాల భామ శిల్పాశెట్టి నటించారు. ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన మోహన్ బాబు శిల్పా శెట్టితోనూ నటించారు. బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. ఆమె తెలుగులో చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో శిల్పా శెట్టి చేసిన సినిమాలు నాలుగే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లోకి ఫోక్ సింగర్.. దేశాన్నే ఊపేసిన పాటలు పాడింది

వాటిలో మోహన్ బాబు సినిమా ఒకటి. ఆ సినిమానే వీడెవడండీ బాబూ.! 1997లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఉల్లత్తై అల్లిత్తా అనే సినిమాకు రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాలో శిల్పా శెట్టి హీరోయిన్ గా చేసింది. అంతకు ముందు వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది శిల్పా శెట్టి. ఆతర్వాత మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ అనే సినిమా చేసింది. ఆతర్వాత నాగార్జునతో కలిసి ఆజాద్ సినిమాలో నటించింది. ఆతర్వాత బాలకృష్ణతో భలేవాడివి బాసు అనే సినిమాలో మెరిసింది.

ఇది కూడా చదవండి : అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..