
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియాలు ఎదురుచూస్తున్నారు. అపజయం తెలియని రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు. మహేష్ ను సినిమాలో ఎలా చూపించబోతున్నారు అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. టైం ట్రావెలర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. వాటిలో ఒకటి రాముడి అవతారం కూడా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబుకు బంధువు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆమె ఎవరో కాదు సహజనటి జయసుధ. అవును జయసుధ మహేష్ బాబు బంధువు. మహేష్ బాబు పిన్ని, కృష్ణ రెండో భార్య విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. గతంలో ఓ ఇంట్వ్యూలో జయసుధ మాట్లాడుతూ..
తనను సహజనటిగా ప్రేక్షకులు అంగీకరించారని, గ్లామరస్ పాత్రలకు తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదని, అలాంటి పాత్రలకు టైప్‌కాస్ట్ కాలేదని జయసుధ తెలిపారు. చిన్ననాటి నుండి టామ్‌బాయ్ లా పెరిగానని, మేనత్త విజయనిర్మలతో కలిసి షూటింగ్‌లకు వెళ్లడం వల్ల సినిమా వాతావరణానికి అలవాటు పడ్డానని జయసుధ తెలిపారు. విజయనిర్మల లిప్‌స్టిక్ వేసుకుంటుంటే తాను కూడా వేసుకోవడం, ఆమె డ్యాన్స్ చేస్తుంటే తాను కూడా డ్యాన్స్ చేయడం వంటి అనుభవాలు పంచుకున్నారు. ఇక మహేష్ బాబుతో కలిసి జయసుధ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, మహర్షి సినిమాలు చేశారు.
మహేష్ బాబు, జయసుధ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి