పొట్టిగా, నల్లగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూ కట్టేలా చేసింది..

ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లను దాటుకుని నటిగా మంచి పాపులారిటినీ సొంతం చేసుకున్నాయి. చాలా మంది అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సంపాదించుకోగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే సినీరంగానికి దూరమయ్యారు.

పొట్టిగా, నల్లగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూ కట్టేలా చేసింది..
Actress

Updated on: Feb 25, 2026 | 10:08 AM

సినిమాల్లో రాణించడం అనేది చాలా కష్టం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో ఎక్కువకాలం ఉండాలంటే కష్టమే.. ప్రస్తుతం ఉన్న పోటీల్లో తట్టుకొని నిలబడటం అంత ఈజీ కాదు. కొంతమంది స్ట్రగుల్స్ పడి సక్సెస్ అయ్యి ఇప్పుడు రాణిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్ హోదా అందుకొని సినిమాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం.. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచాన్ని ఏలేసింది. కెరీర్ మొదట్లో హైట్ తక్కువగా ఉందని.. నలుపు రంగులో ఉందంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కోంది. అంతేకాదు.. ఆమెను పలు ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కున్న ఆమె తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది. ఎంతో మంది స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూశారు. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో తోపే.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్స్ అందించింది ఆ అందాల భామ. ఇంతకీ ఆ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె తండ్రి ఆ అవకాశాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆమె మరెవరో కాదండి.. రాణి ముఖర్జీ. 1978 మార్చి 21న ముంబైలో జన్మించింది. ఆమె కుటుంబం సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో చిన్నప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆమె తాత, మామ బంధువులు సినిమాల్లో పనిచేశారు. కెరీర్ మొదట్లో రాణి ముఖర్జీ హైట్ తక్కువ ఉన్నందున అనేక అవకాశాలు కోల్పోయింది. 1996లో బియర్ ఫూల్ అనే సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

అదే ఏడాది హిందీలో రాజా కీ ఆయేగి బరాత్ మూవీతో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతో నే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆదిత్య చోప్రా ఆమె నటనను ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఆమెకు తన సినిమాలో అవకాశం అందించారు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో తొలి చిత్రం విడుదలైన రెండు సంవత్సరాలకు మరో సినిమా చేసింది. ఆమీర్ ఖాన్ జోడిగా గులాం చిత్రం, షారుఖ్ ఖాన్ సరసన కుచ్ కుచ్ హోతా హై చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత రాణి వెనక్కి తిరిగి చూడలేదు.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

Rani Mukherjee

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us