పెళ్ళైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. సినిమాలకు దూరమై ఇప్పుడు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ , లవ్ స్టోరీలు , రిలేషన్ షిప్స్ అనేవి చాలా కామన్. చాలా మంది హీరోయిన్స్ నిత్యం ఇలాంటి వాటితో వార్తలో నిలుస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోల ఎఫర్స్ పెట్టుకొని కెరీర్ క్లోజ్ అయిన భామలు కూడా ఉన్నారు. ఇక ఈ హీరోయిన్ కూడా పెళ్ళైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది.. దెబ్బకు కెరీర్ క్లోజ్ అయ్యింది.

పెళ్ళైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. సినిమాలకు దూరమై ఇప్పుడు ఇలా..
Tollywood Actress

Updated on: Aug 01, 2025 | 8:12 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. ఓ తప్పు చేసి సినిమా అవకాశాలను మిస్ చేసుకుంది. ఒక పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకొని ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక ఛాన్స్‌ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన అందం అభినయంతో మెప్పించింది. పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకునేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది. సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే

కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదే సమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది. నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితపై అవకాశాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.