అల్లు అర్జున్‌కు వదినగా.. ప్రభాస్‌కు మరదలిగా నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.!

Updated on: Oct 27, 2026 | 2:18 PM

ఒక సినిమాలో కథానాయికతో రొమాన్స్ చేసిన నటీమణులు, మరో సినిమాలో అదే హీరోకి చెల్లిగానో లేదా వేరే స్టార్ హీరోకి వదినగానో కనిపించడం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్న ఇద్దరు టాప్ స్టార్స్, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

1 / 5
ఒక సినిమాలో కథానాయికతో రొమాన్స్ చేసిన నటీమణులు, మరో సినిమాలో అదే హీరోకి చెల్లిగానో లేదా వేరే స్టార్ హీరోకి వదినగానో కనిపించడం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్న ఇద్దరు టాప్ స్టార్స్, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇద్దరి సినిమాల్లోనూ నటించి, ఒకరికి మరదలిగా మరొకరికి వదినగా కనిపించిన ఒక నటి కథ ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఆమె మరెవరో కాదు, ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సింధు తులాని.

2 / 5
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన వైవిధ్యమైన చిత్రం 'ఐతే'తో తెలుగు తెరకు పరిచయమైన సింధు తులాని, తొలి సినిమాతోనే నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన 'అతనొక్కడే' ఆమె కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచి సంచలన విజయం సాధించింది. నవదీప్ తో కలసి నటించిన 'గౌతమ్ SSC' సినిమా కూడా ఆమెలోని నటిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

3 / 5
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సింధు తులాని కొన్ని ప్రత్యేకరకమైన పాత్రలు చేయడానికి మొగ్గు చూపారు.  ప్రభాస్ ,త్రిష కాంబినేషన్‌లో ప్రభుదేవా తెరకెక్కించిన 'పౌర్ణమి' చిత్రంలో ప్రభాస్‌కి మరదలి పాత్రలో సింధు తులాని కనిపించారు. నిడివి కొద్దిసేపే అయినా తన పరిధి మేరకు మెప్పించారు. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది సింధు. ఆతర్వాత  'S/O సత్యమూర్తి' సినిమాలోనూ నటించి మెప్పించింది సింధు తులాని.

4 / 5
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన 'S/O సత్యమూర్తి' సినిమాలో ఆమె వెన్నెల కిషోర్ భార్యగా, అంటే అల్లు అర్జున్‌కి వదిన పాత్రలో కనిపించి మెప్పించారు. వీటితో పాటు నితిన్ హిట్ మూవీ 'ఇష్క్' లో హీరోకి అక్కగా కీలక పాత్ర పోషించి మెప్పించడం విశేషం. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సింధు తులాని అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన హార్రర్ థ్రిల్లర్ 'చిత్రాంగద'లో కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు.

5 / 5
వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన చేతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు 'శ్వేత' అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఎలాంటి గ్లామర్ హంగులకు దూరంగా, కుటుంబంతో కలసి ముంబైలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గ్లోబల్ స్టార్స్‌గా వెలుగుతుండటంతో, వారి చిత్రాల్లో సింధు తులాని చేసిన ఈ ప్రత్యేక పాత్రల గురించిన విశేషాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us