AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రచ్చ లేపిన రాజా రాణి బ్యూటీ..! సినిమాలో అలా.. బయట మాత్రం ఇలా

దర్శకుడు అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.. ఆర్య, నయనతార, నజ్రియా, జై ప్రధాన పాత్రల్లో నటించారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

రచ్చ లేపిన రాజా రాణి బ్యూటీ..! సినిమాలో అలా.. బయట మాత్రం ఇలా
Raja Rani Movie
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2025 | 10:38 AM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంటాయి. కొన్ని సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ బోర్ కొట్టావు.. ఎన్ని సార్లు చూసి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో రాజారాణి సినిమా ఒకటి. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అట్లీకి డైరెక్టర్‌గా తెరకెక్కించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో రెండు అందమైన ప్రేమకథలను చూపించాడు దర్శకుడు. అలాగే ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకుల మనసులను తాకుతుంది. అంతే కాదు ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా హైలైట్ అనే చెప్పాలి.

ప్రతిరోజు నాకు ఫిజికల్ టచ్ కావాలి.. లేకుంటే నిద్రపట్టదు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

తమిళ్ లోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ సినిమా వస్తే టీవీల ముందు అతుక్కుపోతారు ప్రేక్షకులు. రెండు విభిన్నమైన ప్రేమ కథలు ఆ కథల ముగింపు మరో కథకు మొదలవుతుంది. రాజా రాణి సినిమాను అంత సామాన్యంగా ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు కుర్రాళ్ళు గూగుల్ ను గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా.? పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ గుర్తుందా.?

ఇవి కూడా చదవండి

ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

రాజా రాణి సినిమాలో ఆర్య ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్రెండ్ కోసం ఓ రౌడీ గ్యాంగ్ తో గొడవపడతాడు. అప్పుడు అమ్మాయిలకు గొడవ పడకూడదు అంటూ అమ్మాయిల గురించి చెప్తూ నటుడు సంతానం ఓ డైలాగ్ చెప్తాడు. అప్పుడు కాఫీ షాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూపించి. ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్తాడు. ఆ అమ్మాయే ఈ అమ్మయి. సినిమాలో అలా చూపించారు కానీ బయట ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు సాక్షి అగర్వాల్. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది. సూపర్ రజినీకాంత్ నటించిన కాల సినిమాలో నటించింది సాక్షి అగర్వాల్‌. అయితే రాజా రాణి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని అట్లీ మోసం చేశాడని అప్పట్లో కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. ఇది ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.