Salman Khan: బిష్ణోయ్ టార్గెట్ అతడే.. సల్మాన్ ఖాన్ భద్రత కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా.. ?

|

Oct 18, 2024 | 8:14 AM

సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఎక్కడ చూసి ఈ స్టార్ హీరో పేరు మారుమోగుతుంది. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఈ హీరోకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరోవైపు సల్మాన్ ను ఎవరూ కలవకుండా, ఎలాంటి ఫోటో సెషన్స్ జరగకుండా చూసుకుంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ వర్గం టార్గెట్ సల్మాన్ ఖాన్ కావడంతో అతడికి మరింత భద్రత ఏర్పాటు చేశారు.

Salman Khan: బిష్ణోయ్ టార్గెట్ అతడే.. సల్మాన్ ఖాన్ భద్రత కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా.. ?
Bishnoi, Salman Khan
Follow us on

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబై పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వై + భద్రత కల్పించారు. బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో బీటౌన్ స్టార్స్ భద్రత మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. సల్మాన్ ఖాన్ కు సిద్ధిఖీ సన్నిహితుడు. వీరిద్దరి మధ్య స్నేహం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ షూటింగ్ మధ్యలోనే ఆపేసిన సల్మాన్.. హుటాహుటిన సిద్ధిఖీ పార్థివదేహాన్ని చూసేందుకు వెళ్లారు. అనంతరం సిద్ధిఖీ అంత్యక్రియల ఏర్పాట్లలోనూ పాల్గొ్న్నారు. సిద్ధీఖీ హత్య తర్వాత బంధువులను, స్నేహితులను, అభిమానులను నేరుగా కలబోనని చెప్పాడు సల్మాన్. అలాగే స్టార్ హీరో ఇంటి వద్ద ఫోటోగ్రాఫర్స్, సెల్ఫీలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. బాంద్రాలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల భద్రతను పెంచారు.

సల్మాన్ కోసం మొత్తం ఆరు భద్రతా విభాగాలు ఉన్నాయి. X, Y, Y+, Z, Z+, SPG. ప్రధానమంత్రి, ఆయన పరివారం భద్రతకు SPG బాధ్యత వహిస్తుంది. ఏ వ్యక్తికైనా ప్రభుత్వం అదనపు భద్రతను అందించగలదు. ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది. X క్లాస్ సెక్యూరిటీకి ఒక గన్‌మెన్ మాత్రమే ఉన్నారు. Y వర్గంలో ఇద్దరు గన్ మెన్స్ ఉంటారు. Y+ అంటే 11 మంది సెక్యూరిటీ గార్డులు సల్మాన్ ఖాన్‌కు అందించిన భద్రత. సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

ఇది చదవండి : Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

అయితే వారు రోజూ మారుతూ ఉంటారు. ‘ఏబీపీ లైవ్’ రిపోర్ట్ ప్రకారం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఖర్చు కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వై ప్లస్ సెక్యూరిటీకి ఏడాదికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంటున్నారు. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటి బయట షూటింగ్ జరిగినప్పటి నుంచి మరింత భద్రత పెంచారు.

ఇది చదవండి : Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.