AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది మావ..! వనిత విజయ్ కుమార్ కూతురు అందంలో అమ్మను బీట్ చేసిందిగా..!

తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా విషయాల కంటే తన వ్యక్తి గత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె. ముఖ్యంగా పెళ్లి విషయాలతో వనిత పేరు తరచూ వార్తల్లో వినిపించసాగింది.

ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసింది మావ..! వనిత విజయ్ కుమార్ కూతురు అందంలో అమ్మను బీట్ చేసిందిగా..!
Vanitha Vijay Kumar
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2025 | 2:12 PM

Share

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటీమణుల్లో వనిత విజయ్ కుమార్ ఒకరు. సినిమాతో చాలా మంది పాపులర్ అవుతుంటే ఈ అమ్మడు మాత్రం వ్యక్తిగత విషయాలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వనిత విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు విజయ్ కుమార్. ఇక వనిత విషయానికొస్తే తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో దేవి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు

ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఆ వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తెలుగులో దేవి సినిమా తర్వాత తిరిగి చివరిగా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది వనితా. కాగా ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికొస్తే.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది అతనితో కూడా విడిపోయింది. అయితే ఇప్పుడు వనిత విజయ్ కుమార్ కూతురు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను చూసి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని పై వనిత విజయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమార్తె జోవిక ను సినిమాల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నా.. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..