Anushka Sharma: అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీగార్డ్ జీతం తెలిస్తే లైఫ్ సెట్టు.. ఎంత ఉంటుందంటే..

చాలా సందర్భాల్లో అనేక మార్గాల్లో తమ విదేయతను నిరూపించుకున్నారు. అలాగే క్లిష్టమైన పరిస్థితులలో తమ యాజమానులను కాపాడుకోవడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కొన్నిసార్లు సినీ ప్రముఖుల బాడీగార్డ్స్ ఆత్యుత్సాహం ప్రదర్శిస్తారు.. మరికొందరు మాత్రం ప్రశంసలు పొందుతారు. అలాగే వారికి ఇచ్చే జీతం గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కార్పోరేట్ సంస్థలలోని సీఈవోతో సరిసమానంగా సినీ తారల బాడీగార్డ్స్ జీతాలు ఉంటాయని సమాచారం.

Anushka Sharma: అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాడీగార్డ్ జీతం తెలిస్తే లైఫ్ సెట్టు.. ఎంత ఉంటుందంటే..
Anushka Sharma, Virat Kohli
Follow us

|

Updated on: Apr 17, 2024 | 7:02 PM

ఇండస్ట్రీలోని తారలకు నమ్మకమైన బాడీగార్డ్స్ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్లకు చాలా సంవత్సరాలుగా ఒకరిద్దరు బాడీగార్డ్స్ ఎంతో నమ్మకంగా.. సొంత ఫ్యామిలీలా కలిసిపోతుంటారు. అలాంటి నమ్మకమైన.. నమ్మదగిన బాడీగార్డ్స్ ఉండడం నిజంగా సెలబ్రెటీలకు ఒక వరమే. సల్మాన్ ఖాన్‏కు షేరా అనే వ్యక్తి.. అలాగే షారుఖ్ ఖాన్‏కు రవిసింగ్ చాలా నమ్మకమైన వ్యక్తులు. అలాగే ఇతర నటీనటులకు కూడా బాడీగార్డ్స్ నీడలాగా ఉంటారు. చాలా సందర్భాల్లో అనేక మార్గాల్లో తమ విదేయతను నిరూపించుకున్నారు. అలాగే క్లిష్టమైన పరిస్థితులలో తమ యాజమానులను కాపాడుకోవడానికి ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కొన్నిసార్లు సినీ ప్రముఖుల బాడీగార్డ్స్ ఆత్యుత్సాహం ప్రదర్శిస్తారు.. మరికొందరు మాత్రం ప్రశంసలు పొందుతారు. అలాగే వారికి ఇచ్చే జీతం గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కార్పోరేట్ సంస్థలలోని సీఈవోతో సరిసమానంగా సినీ తారల బాడీగార్డ్స్ జీతాలు ఉంటాయని సమాచారం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‏లో క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జంట ఒకటి. వీరిద్దరి బాడీగార్డ్ జీతం గురించి తెలిస్తే లైఫ్ సెట్టవ్వాల్సిందే. 2017లో విరాడ్ కోహ్లీతో వివాహానికి ముందు అనుష్కకు ప్రకాష్ సింగ్ అక్తా సోను అనే బాడీగార్డ్ ఉన్నాడు. అతడు చాలా సంవత్సరాలుగా అనుష్కకు నమ్మకమైన వ్యక్తి. అతని అంకితభావం వృత్తిపరమైన బాధ్యతను మించిపోయింది. అలాగే అనుష్క, విరాట్ కు సంబంధించిన ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. నివేదికల ప్రకారం అనుష్క పర్సనల్ బాడీగార్డ్ సోను వార్షిక వేతనం రూ. 1.2 కోట్లు. అతని సంపాదన దేశంలోని చాలా మంది టాప్ CEOల ప్యాకేజీలను మించి ఉంటుంది.

2018లో జీరో సినిమా చిత్రీకరణ సమయంలో తన బాడీగార్డ్ సోను పుట్టినరోజు వేడుకలను మూవీ సెట్‏లో ఎంతో ఘనంగా నిర్వహించింది అనుష్క. అందుకు సంబంధించిన ఫోటో అప్పట్లో వైరలయ్యింది. అనుష్కకు మాత్రమే కాకుండా పబ్లిక్ ఈవెంట్లలో విరాట్ కోహ్లీ భద్రతను కూడా సోనూ చూసుకుంటాడు. అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులకు పాప వామిక జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ బ్యూటీపుల్ కపూల్ తమ బాబును ఈ ప్రపంచంలోకి స్వాగతించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.