AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఈ కమెడియన్ గుర్తున్నారా? పాపం ఎలా చనిపోయారో తెలుసా?

ఈ టాలీవుడ్ నటుడిని చూస్తేనే పెదాలపై నవ్వు వస్తుంది. అంతలా తన నటనతో, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ ను నవ్వించారు. ముఖ్యంగా చెప్పవే చిరుగాలి సినిమాలో సునీల్ తో కలిసి ఆయన చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

తెలుగు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఈ కమెడియన్  గుర్తున్నారా? పాపం ఎలా చనిపోయారో తెలుసా?
Actor Visweswara Rao
Basha Shek
|

Updated on: Nov 13, 2026 | 7:23 PM

Share

గరిమెళ్ల విశ్వేశ్వరరావు.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టలేరు. కానీ పైన ఫొటో చూస్తే ఇట్టే ఓ అమాయకమైన రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, సీరియల్స్ లో నటించారాయన. అన్నిటికీ మించి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన అతికొద్ద మంది నటుల్లో విశ్వేశ్వరరావు కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో విశ్వేశ్వరరావు జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి హరికథలు చెప్పేవారు. దీంతో సహజంగానే విశ్వేశ్వరరావుకు కూడా నటనపై ఆసక్తి ఏర్పడింది. తండ్రితో పాటు హరికథలకు వెళ్లిన విశ్వేశ్వరరావు ప్రతిభను మహానటులు చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు లు గుర్తించారు. విశ్వేశ్వరరావును బాగా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, ఛైల్డ్ ఆర్టిస్టుగానే సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించారు గరిమెళ్ల. చాలా చిన్న వయులోనే ఎన్టీఆర్, శోభన్ బాబు, చలం వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ముగ్గురితోనూ కలిసి నటించిన అరుదైన ఘనత విశ్వేశ్వరరావు సొంతం. కాగా యుక్తవయసులోకి వచ్చాక సినిమాలు తగ్గించేశారు గరిమెళ్ల. పూర్తిగా చదువుపై దృష్టి సారించారు. ఈ కారణంగా దాదాపు పదేళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారాయన. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ 1990లో ఇండ్ట్రీలోక రీఎంట్రీ ఇచ్చారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రజినీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో నటించారు గరిమెళ్ల.

ముఠామేస్త్రీ, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్‌ అల్లుడు, శివాజీ, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, భైరవ ద్వీపం, పెళ్లి సందడి, చెప్పవే చిరుగాలి, నువ్వు వస్తావని, కితకితలు, మా నగరం, శివపుత్రుడు వంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు విశ్వేశ్వరరావు. తెలుగు, తమిళ తదితర భాషల్లో వందలాది సినిమాలు చేశారు గరిమెళ్ల. అలాగే 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువయ్యారు. అయితే బాలనటుడిగా అందుకున్న క్రేజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అందుకోలేకపోయారు గరిమెళ్ల. అయినా చివరి వరకు సినిమాల్లోనే కొనసాగారీ ట్యాలెంటెడ్ యాక్టర్. కాగా నటుడిగా బిజీగా ఉంటోన్న సమయంలోనే ప్రమాదకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు విశ్వేశ్వరరావు. సుమారు రెండేళ్ల పాటు ఈ వ్యాధితో పోరాడారాయన. చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు 2024 ఏప్రిల్ 3న చెన్నైలోని ఒక ఆసుపత్రిలో విశ్వేశ్వరరావు కన్నుమూశారు. అప్పుడు ఆయన వయసు 64 ఏళ్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో