AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా? స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గదు.. ఫొటోస్ వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో 'కార్తీ' హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సిరుత్తై'. రవితేజ విక్రమార్కుడు సినిమాకు ఇది తమిళ రీమేక్. తెలుగులో మాదిరే తమిళంలో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో కార్తీ కూతురిగా ఒక పాప చాలా క్యూట్ గా నటించింది.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా? స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గదు.. ఫొటోస్ వైరల్
Child Artist Rakshana
Basha Shek
|

Updated on: Jul 05, 2026 | 2:37 PM

Share

కెరీర్ ప్రారంభంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలా మంది ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అయితే తాను మాత్రం డిఫరెంట్ అంటోంది రక్షణ. ఈ పేరు తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ తమిళ డబ్బింగ్ సినిమాలు చూసే వారికి ఈ అమ్మడు బాగా తెలిసే ఉంటుంది. 2011లో వచ్చిన సిరుత్తై సినిమాతో తెరంగేట్రం చేసింది రక్షణ. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడికి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో కార్తీ కూతురిగా నటించిందీ అమ్మాయి. మొదటి సినిమాలోనే తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టి పడేసింది. దీని తర్వాత కూడా ఈ పాపకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత మణిరత్నం, సముద్రఖని లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించింది. అయితే వీటి తర్వాత సినిమాలేవీ చేయలేదీ అమ్మడు. చదువు, ఇతరత్రా కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది.

కాగా గతేడాది ఇంటర్ పూర్తి చేసింది రక్షణ. ఇప్పుడు కూడా సినిమాలకంటే చదువే ముఖ్యమంటోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రక్షణ. తన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను కూడా అందులో పంచుకుంటోంది. నెటిజన్ల నుంచి కూడా ఈ అమ్మడి ఫొటోలకు లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సినిమా అవకాశాలు వస్తున్నా.. అందుకు తాను ఇప్పుడే సిద్ధంగా లేనంటోంది రక్షణ. ‘ ప్రస్తుతం నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గా చేయమని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నేను అందుకు సిద్ధంగా లేను. ప్రస్తుతం నా దృష్టంతా చదువు, క్లాసిక్‌ డ్యాన్స్‌ల మీదే ఏంది. కాస్త టైం తీసుకుని మంచి అవకాశం వచ్చాకే మళ్లీ కెమెరా ముందుకు వస్తాను’ అంటోంది రక్షణ. ఏదేమైనా ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రక్షణ రీసెంట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?