మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి

కొన్నినెలల క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది ఓ అమ్మాయి. ఒకేఒక్క డైలాగ్ ఫేమస్ అయ్యింది. ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మడు తెగ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు నెట్టింట ఈ భామ గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
Actress

Updated on: Oct 04, 2026 | 4:27 PM

టాలీవుడ్‌లో కామెడీ ఎంటర్‌టైనర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కథలో పెద్దగా కనిపించకపోయినా.. కొన్ని పాత్రలు, కొన్ని డైలాగులు మాత్రం ప్రేక్షకుల మదిలో బలంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘మత్తువదలరా 2’ కూడా ఒకటి. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించగా.. సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా సత్య, శ్రీసింహా మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలైన తర్వాత సత్య పాత్రకు సంబంధించిన పలు డైలాగులు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మత్తువదలరా 2లో సత్య, అజయ్ మధ్య జరిగే ఓ సన్నివేశం ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇందులో సత్య.. ‘రియా ఎక్కడ.?’ అని అడగడం, అందుకు అజయ్ ‘రియా ఎవరు.?’ అని ప్రశ్నించడం.. ఆ తర్వాత ‘దామిని డాటర్’ అంటూ సత్య చెప్పడం, మళ్లీ ‘దామిని ఎవరు.?’ అని అజయ్ అడగడం వంటి సన్నివేశాలు మంచి కామెడీని పండించాయి.

చిరంజీవి, వెంకటేష్‌లతో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? సోషల్ మీడియాను ఊపేస్తుందిగా..

ఈ డైలాగ్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. సినిమా చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు సరదాగా ‘రియా ఎక్కడ.?’ అంటూ కామెంట్లు చేశారు. దీంతో అసలు రియా ఎవరు.? అనే ఆసక్తి కూడా చాలామందిలో పెరిగింది. ఆ సమయంలో ఆమె గురించి నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారు. సినిమాలో ‘రియా’ పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు ఇషా యాదవ్. సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ.. రియా ఎక్కడ.? అనే డైలాగ్ కారణంగా ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. సినిమా తర్వాత ఇషా యాదవ్ సోషల్ మీడియాలోనూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎవర్రా నువ్వు..! బర్త్ డే రోజున హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అభిమాని.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

ఇషా యాదవ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లోనూ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టైలిష్ లుక్, ఫిట్‌నెస్, గ్లామర్‌తో ఇషా ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిన్న పాత్రతో పరిచయమైన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

10th క్లాస్ మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ఖచ్చితంగా డైరెక్టర్ అవుతానంటున్న స్టార్ హీరో కూతురు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us