మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన చరణ్ ప్రస్తుతం బడా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. గేమ్ ఛేంజర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట అయ్యాయి. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా నెలలుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన ఓ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని చాలా మందికి తెలియక పోవచ్చు. అవును రామ్ చరణ్ హీరోగా నటించిన ఓ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు చరణ్. రామ్ చరణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే..
అయితే చరణ్ హీరోగా ఓ సినిమా మొదలై షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. ఆ సినిమానే మెరుపు. స్పోర్డ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిచాలి అనుకున్నారట. పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తీసిన దర్శకుడు ధరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే చరణ్ ఆరెంజ్ సినిమాను కూడా లైనప్ చేశాడు. అదే టైం లో ఈ సినిమాను షూటింగ్ ను కూడా ప్రారంభించారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై మెరుపు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను కూడా సెలక్ట్ చేశారట. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పూర్తి కాలేదని తెలుస్తోంది. షూటింగ్ మొదలు పెట్టిన కొద్దిరోజులకే ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.