AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Kishan: రేసు గుర్రం విలన్ గుర్తున్నాడా? ఆయన కూతురు కూడా క్రేజీ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాల్లో రేసు గుర్రం ఒకటి. ఈ సినిమాతో బన్నీ కి ఎంత పేరొచ్చిందో భోజ్ పురి నటుడు రవి కిషన్ కు అంతే మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో అతను పోషించిన మద్దాలి శివారెడ్డి పాత్ర ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చింది.

Ravi Kishan: రేసు గుర్రం విలన్ గుర్తున్నాడా? ఆయన కూతురు కూడా క్రేజీ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Ravi Kishan Family
Basha Shek
|

Updated on: Jul 22, 2025 | 9:58 PM

Share

భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నాడు రవి కిషన్. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, హీరో ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు రవి కిషన్. లేటెస్ట్ గా బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ లోనూ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రవి కిషన్. మొదట కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2017లో బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్ పూర్ ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్ లో నూ భారీ మెజారిటీతో మళ్లీ గెలుపొందారు రవి కిషన్. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూన మరోవైపు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నారీ భోజ్ పురి యాక్టర్.

కాగా రవి కిషన్ 1993లో ప్రీతిశుక్లా తో కలిసి పెళ్లిపీటలెక్కాడు. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఒకడు కుమారుడు, మరో ముగ్గురు కూతుర్లు. ఇందులో ఒక కూతురు ఆర్మీలో చేరింది. భారత సైన్యానికి సేవలందిస్తోంది. అయితే ఇంకో కూతురు రివా కిషన్ కూతురు మాత్రం తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమాలు, నటనపై మక్కువ ఉండడంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2015లో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కుమార్తె హీబాతో కలిసి పరిందో కి మెహ్ఫిల్ అనే నాటకం కోసం ఆమె పనిచేసింది రీవా కిషన్. అలాగే ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 2016లో, రివా ముంబైలోని టెరెన్స్ లూయిస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TLPTI) నుండి డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. నటనలో శిక్షణ పొందేందుకు USA కూడా వెళ్లింది.

ఇవి కూడా చదవండి

అమ్మానాన్నాలతో రివా కిషన్..

View this post on Instagram

A post shared by Riva Kishan (@itsrivakishan)

2020లో సబ్ కుశల్ మంగల్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది రీవా కిషన్. ఈ సినిమా బాగానే ఆడింది. రివా నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే దీని తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ స్టార్ కిడ్. అయితే ఇటీవలే తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ రివా కిషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన తొలి ఫ్యాషన్ లేబుల్ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలోనూ రీవాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

View this post on Instagram

A post shared by Riva Kishan (@itsrivakishan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.