Hanuman Ansh: తెలుగులో హనుమాన్ అంశ్‌కు నిరాశే.. హిందీలో రూ.430 కోట్లు.. మరి ఇక్కడ ఎంతంటే

ఈ మధ్యన చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం హనుమాన్ అంశ్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తెరకెక్కించిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 430 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

Hanuman Ansh: తెలుగులో హనుమాన్ అంశ్‌కు నిరాశే.. హిందీలో రూ.430 కోట్లు.. మరి ఇక్కడ ఎంతంటే
Hanuman Ansh Movie

Updated on: Oct 12, 2026 | 12:11 PM

ఇతర భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఎంత మంచి కంటెంట్ ఉన్నా.. ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. గతంలో చాలా సినిమాలు ఇలానే వచ్చి తెలుగులో బోల్తా పడ్డాయి. కొన్ని సినిమాలు మాత్రం ఘనవిజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి.  ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుంది.  హిందీలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. హిందీలో మంచి వసూళ్లతో వార్తల్లో నిలిచిన హనుమాన్ అంశ్.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్ ఎదుర్కొంటోంది. సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు స్టోరీ నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడుతుండగా.. హనుమంతుడిపై భక్తి, ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారు మాత్రం ఒకసారి చూడదగిన చిత్రమని చెబుతున్నారు. అయితే విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై తెలుగులో పెద్దగా హైప్ కనిపించలేదు.

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను మరో భాషలో విడుదల చేయాలనుకున్నప్పుడు వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా మంచింది ఆలస్యం అయితే దానిమీద ఉన్న బజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సినిమా గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తే మంచి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హనుమాన్ అంశ్ విషయంలో తెలుగు విడుదలకు సుమారు 50 రోజుల సమయం పట్టింది. ఈలోగా హిందీ వెర్షన్‌ను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తెలుగులో మళ్లీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. మరోవైపు, తెలుగు డబ్బింగ్ కోసం ఎదురుచూసిన వారిలోనూ రోజురోజుకు ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో విడుదలకు ముందే సినిమాకు రావాల్సిన ప్రచారం, ప్రేక్షకుల క్యూరియాసిటీ కొంత మేర దెబ్బతిన్నాయని చెప్పొచ్చు.

ఈ సినిమాకు సంబంధించిన మరో అంశం నీమ్ కరోలీ బాబా జీవితం. ఉత్తర భారతదేశంలో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ.. దక్షిణాది ప్రేక్షకులందరికీ ఆయన గురించి పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అందువల్ల ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారన్నది ఇక్కడ ముఖ్యమైన విషయంగా మారింది. సినిమా కథ, అందులోని ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే బలమైన ప్రమోషన్స్ కూడా అవసరం. ఈ విషయంలో తెలుగు మార్కెట్‌లో తగినంత ఆసక్తి ఏర్పడకపోవడం సినిమాపై ఎఫెక్ట్ అయ్యిందనే చెప్పాలి. హిందీ మార్కెట్‌లో వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మాత్రం అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతోంది. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీ మార్కెట్‌లో రూ.430 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరిగింది.. అయితే తెలుగు వెర్షన్ కలెక్షన్లు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ హక్కులను హోంబలే ఫిల్మ్స్ తీసుకోగా.. స్థానిక డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో సుమారు రూ.10 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మొత్తం రూ.11 కోట్లకు దగ్గరగా షేర్ సాధించాల్సి ఉంటుంది. అయితే తొలి వీకెండ్ ముగిసే సమయానికి తెలుగు వెర్షన్ సుమారు రూ.1.8 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us