Tollywood Heroine: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా..?

సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి.. ప్రస్తుతం లీడ్‌లో ఉన్న నయనతార తరహాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతోంది ఈ టాలీవుడ్ నటి. తన కంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంది.

Tollywood Heroine: టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న ఈ నటి ఎవరో గుర్తు పట్టగలరా..?
Tollywood Heroine

Updated on: Sep 11, 2021 | 1:00 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నెగ్గుకురావడం మాములు విషయం కాదు. స్టార్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుటి మాదిరిగా సంవత్సరాల తరబడి రాణించడం కుదరదు. ఎందుకంటే కొత్తనీరు రాగానే పాతనీరు వెళ్లిపోతుంది. అయితే అందుకు తాను భిన్నం అని ఫ్రూవ్ చేసుకుంది ఓ నటి. సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి.. ప్రస్తుతం లీడ్‌లో ఉన్న నయనతార తరహాలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతోంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకుంది.  సీనియారిటీకి సీనియారిటీ… మెచ్యూరిటీకి మెచ్యూరిటీ. పైగా.. టాలెంట్‌ విషయంలో ఆమెకు ఆమే పోటీ అన్నట్లు దూసుకుపోతోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది మేము చెప్పేది సమంత గురించి అని. ప్రజంట్ ఆమె ఎన్నుకుంటున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తేనే తన ఫోకస్ ఏంటన్నది అర్థమైపోతోంది. పర్సనల్ లైఫ్ విషయంలో కాస్త గడ్డుకాలంలో ఉన్నప్పటికీ.. ప్రొఫెషినల్‌గా మాత్రం దూసుకుపోతోంది. ఏప్రిల్ 28వ తేదీ 1987లో సంవత్సరంలో జన్మించింది సమంత అక్కినేని. 2010లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తెలుగు-తమిళ్ భాషల్లో ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ సమంత బాలీవుడ్ వైపు వెళ్లలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది. వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన యూ టర్న్, ఓ బేబీ సినిమాలు మంచి విజయాలు నమోదు చేశాయి. తాజాగా ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత అదరగొట్టిన విషయం తెలిసిందే.

Also Read: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదంపై బండ్ల గణేష్ ట్వీట్..

మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్

Follow Us