Tollywood: ఎంత పని చేశావ్ అమ్మడు.. ఛయ్య ఛయ్య పాటను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. చేసుంటే లైఫ్ వేరేలా ఉండేది..

కొన్ని పాటలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలు గడిచినా ఆ సాంగ్స్ డిమాండ్ ఏమాత్రం తగ్గదు. ఇప్పటికీ ఎక్కడ చూసిన.. ఏ ఫోన్ లో అయినా పలు సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అందులో ఛయ్య ఛయ్య సాంగ్ ఒకటి. ఈ పాటకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు యువతకు కిక్కెంచిన ఈ సాంగ్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటుంది. ఈ పాటతో హీరోయిన్ మలైకా అరోర లైఫ్ మారిపోయింది. కానీ ఆ పాటను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood: ఎంత పని చేశావ్ అమ్మడు.. ఛయ్య ఛయ్య పాటను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. చేసుంటే లైఫ్ వేరేలా ఉండేది..
Shilpa Shirodkar

Updated on: Jul 07, 2026 | 6:35 PM

సాధారణంగా చాలా పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. తెలుగు పాటలే కాదు.. తమిళం, హిందీ, మలయాళం సాంగ్స్ సైతం ప్రపంచాన్ని ఊపేశాయి. భాష అర్థంకాకపోయినా కొన్ని పాటలకు ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వాటిలో ఛయ్య ఛయ్య సాంగ్ ఒకటి. ఈ పాటకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలు దాటినా ఈ సాంగ్ డిమాండ్ తగ్గడం లేదు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ప్రితీ జింటా జంటగా నటించిన దిల్ సే సినిమాలోనిది ఈ పాట. ఇందులో మలైకా అరోరా నటించింది. ఛయ్య ఛయ్యా పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది మలైకా. దీంతో ఆమె లైఫ్ మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ తనదైన ముద్ర వేసింది. అయితే ఈ పాట కోసం ముందుగా వేరో హీరోయిన్ అనుకున్నారట. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శిరోద్కర్. ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్ సీజన్ 5’ షోలో పాల్గొన్న శిల్పా శిరోద్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు ఛయ్య ఛయ్య సాంగ్ ఛాన్స్ ఇచ్చారని.. కానీ అందుకు 15 రోజుల్లో బరువు తగ్గాలనే షరతు కూడా ఉందని తెలిపారు.

కేవలం 15 రోజుల్లో బరువు తగ్గడానికి తాను శాయశక్తులా ప్రయత్నించానని శిల్పా చెప్పింది. ఆమె కొంత బరువు తగ్గినా అది సరిపోలేదని ఫరా ఖాన్ చెప్పింది. అందుకే, చివరికి ఆ పాట ఆమె చేతి నుండి వెళ్లిపోయిందని అన్నారు. ఆ సమయంలో తాను అధిక బరువుతో ఉన్నందున ఈ అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందని శిల్పా వివరించారు. అయితే, ఫరా ఖాన్ ఇప్పటికీ ఆమె బరువు 100 కేజీలు అని సరదాగా చెబుతుంటారని.. కానీ వాస్తవానికి, తాను అంత బరువు ఎప్పుడూ లేనని ఆమె నవ్వుతూ వివరించారు. ప్రస్తుతం శిల్పా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

శిల్పా శిరోద్కర్ విషయానికి వస్తే.. 1990వ దశకంలో టాప్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు. తెలుగులో మోహన్ బాబు నటించిన బ్రహ్మ సినిమాలో కథానాయికగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ హిందీలో వరుస అవకాశాలు అందుకుంది. ఇక దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఇటీవల సుధీర్ బాబు నటించిన జటాధర మూవీతో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది. 2000వ సంవత్సరంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన బ్యాంకర్ అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అనౌష్క రంజిత్ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం శిల్పా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

 

శిల్పా శిరోద్కర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

 

Follow Us