Sara Ali Khan: కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన యంగ్ బ్యూటీ.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

|

Oct 18, 2024 | 6:27 PM

ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన తల్లితో విడివిడిగా జీవిస్తోంది.  హీరోయిన్ గా కష్టపడి ఎదుగుతున్న సారా నటిగా రాణిస్తోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటుంది.

Sara Ali Khan: కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన యంగ్ బ్యూటీ.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Sara Ali Khan
Follow us on

బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో సారా అలీ ఖాన్ ఒకరు. ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఇతర జోనర్స్ లోనూ సినిమాలు చేస్తోంది. అలాగే సీరియస్ పాత్రలలో నటిస్తోంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన తల్లితో విడివిడిగా జీవిస్తోంది.  హీరోయిన్ గా కష్టపడి ఎదుగుతున్న సారా నటిగా రాణిస్తోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటుంది. సారా అలీ ఖాన్ కూడా కొని బిజినస్ లు అలాగే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి కూడా పెట్టింది.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

తన తల్లి అమృత్ రావ్‌తో కలిసి నివసిస్తున్న సారా అలీ ఖాన్ ఇప్పుడు తన తల్లితో కలిసి బాంద్రాలో స్థలం కొనుగోలు చేసింది. సారా అలీఖాన్  భారీ స్థలం కోసం రూ.22 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఆస్తి అమృతరావు, సారా అలీఖాన్‌ల పేరిట ఉంది. ముంబైలోని విలాసవంతమైన,  రద్దీ ప్రాంతాలలో ఒకటైన అంధేరీ వెస్ట్‌లో సారా అలీ ఖాన్ ఈ స్థలం కొనుగోలు చేసింది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

స్థలం పరిమాణం దాదాపు 4000 చదరపు అడుగులు. సారా అలీఖాన్ గతేడాది జూలైలో ఓ భవనంలోని నాలుగో అంతస్తులో కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆ కార్యాలయానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దానితో పాటు  మూడు కార్ పార్కింగ్ స్పాట్‌లను కూడా కొనుగోలు చేసింది. సారా ఆఫీస్ కొన్న భవనంలోనే కొందరు బాలీవుడ్ ప్రముఖులు కమర్షియల్ స్పేస్‌ని కొనుగోలు చేశారు. అదే భవనంలోని 21వ అంతస్తులో అమితాబ్ బచ్చన్ కార్యాలయం ఉంది. అదే భవనంలో, బాలీవుడ్ నటుడు, సారా స్నేహితుడు కార్తీక్ ఆర్యన్‌కు కూడా కార్యాలయం ఉంది, అతను గత నెలలో 10.80 కోట్లకు దాన్ని కొనుగోలు చేశాడు. గత కొన్నేళ్లుగా చాలా మంది బాలీవుడ్ నటీనటులు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అజయ్ దేవగన్ కూడా గత మూడేళ్లలో 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ కొనుగోలు చేశారు. ఇటీవల హృతిక్ రోషన్ కూడా భారీ మొత్తంలో స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. కంగనా రనౌత్ కూడా గత నెలలో ముంబైలోని బాంద్రాలో 1.90 కోట్ల రూపాయలతో ఒక చిన్న కార్యాలయాన్ని కొనుగోలు చేసింది.