
బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి అషురెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ప్రాణ స్నేహితుడు, నటుడు భరత్ కాంత్ అకాల మరణం చెందారు. ఈ విషయాన్ని అషురెడ్డి స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడిని కోల్పోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపింది. తనతో కలిసున్న ఫోటోలను పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్ అని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. భరత్ కాంత్ మరణ వార్త తెలుసుకున్న అషురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
“నీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను. మనం కలిసి గడిపిన క్షణాలు, నువ్వు నాపై చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. ఎప్పటికీ మా గుండెల్లో జీవించే ఉంటావు ” అంటూ తన బాధను వ్యక్తపరిచారు. భరత్‌తో దిగిన కొన్ని పాత ఫోటోలను, వీడియోలను కూడా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు. భరత్ మరణం పట్ల సోషల్ మీడియాలో పలువురు నటీనటులు సైతం ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
భరత్ కాంత్.. వర్ధమాన నటుడు భరత్ కాంత్, యంగ్ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్త సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. భరత్ కాంత్ ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు వెబ్ సిరీస్‌లలో కూడా కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న ఈ ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..