నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు..! బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. చాలా మంది ఈ ఆడిషన్స్ లో పాల్గొంటున్నారు. ఈసారి అగ్నిపరీక్షకు కూడా బిందుమాధవి,నవదీప్, అభిజిత్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సీజన్ 2 టెలికాస్ట్ అవుతుంది కూడా..

నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు..! బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చిన మాజీ కంటెస్టెంట్
Biggboss 10

Updated on: Aug 18, 2026 | 12:24 PM

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆగస్టు 15 నుంచి టెలికాస్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి హౌస్లోకి సామాన్యులు కూడావెళ్లనున్నారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా అగ్నిపరీక్ష గేమ్ షో పెట్టి పలువురు సామాన్యులను ఎంపిక చేసి హౌస్ లోకి పంపించనున్నారు. సీజన్ వన్ లానే ఈసారి కూడా బిందుమాధవి, నవదీప్, అభిజిత్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే కొందరు కామనర్స్ హౌస్ లోకి వెళ్ళడానికి సెలక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి పై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను షేర్ చేశాడు. ఇంతకూ ఆయన మరెవరో కాదు నటరాజ్ మాస్టర్.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

డాన్స్ మాస్టర్ నటరాజ్ కూడా బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఒకటి కాదు మనోడు రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ అలాగే బిగ్ బాస్ ఓటీటీలోనూ పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన బిందు మాధవి మీద ఫైర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందంటే.. తాజాగా జరిగిన అగ్నిపరీక్ష ఎపిసోడ్ లో ఆర్జే సరదాగా జడ్జ్ గా ఉన్న బిందు మాధవిని ఇంటర్వ్యూ చేశాడు. గతంలో బిగ్ బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్‌ మాస్టర్‌ మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

శూర్పణఖ.. ఇదిగో నా బాణం అంటూ ఓ కంటెస్టెంట్ మీ మీద చేసిన కామెంట్స్ సమయంలో మీకు ఏమనిపించింది అని అడిగాడు. ఆ సమయంలో తాను చాలా ఇరిటేట్‌ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్‌ చెప్పాలనిచెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేశాడు. అలాంటోళ్లు కూడా ఉండాలా.? అలాంటోళ్లు అంటే ఏంటి.? మాట జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. అలాంటోళ్ళు అంటావా.? అసలు ఏమనుకుంటున్నావ్..? ఒక ఫ్లాట్ ఫామ్‌పై కూర్చుని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? అది గేమ్ అప్పుడే అయిపొయింది. అంతా మార్చిపోయి.. నా పాప బర్త్ డేకి కూడా నిన్ను పిలిచాను. ఇప్పుడు ఇలా మాట్లాడ్తావా.? అక్కడ అడిగిన దాని గురుంచి మాట్లాడు.. నీ గురించి నువ్వు చెప్పుకో.. అంతే కాదు అలాంటోళ్ళు అంటూ నా గురించి మాట్లాడతావా.? ‘అలాంటోళ్లు’ అని అన్నావ్ కదా.. ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్.

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us