AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఏడో వారం నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. ఏం పీకావ్ అంటూ రెచ్చిపోయిన వర్షిణి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి హీట్ పెంచింది. ఇప్పటికే మాటల యుద్ధాలు, వ్యక్తిగత విమర్శలతో హోరెత్తుతున్న కంటెస్టెంట్లు.. నామినేషన్ల సమయంలోనూ అదే దూకుడు ప్రదర్శించారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ, పాత విషయాలను ప్రస్తావిస్తూ వాదనలకు దిగారు. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్, వర్షిణి, నీతూ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

Bigg Boss Telugu 10: ఏడో వారం నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. ఏం పీకావ్ అంటూ రెచ్చిపోయిన వర్షిణి
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2026 | 8:10 AM

Share

రీసెంట్ ఎపిసోడ్‌లో నామినేషన్లకు ముందు నుంచే హౌస్‌లో వాడివేడిగా చర్చలు జరిగాయి. వంశీతో మాట్లాడిన త్రిగుణ్.. గత నామినేషన్లలో రోహిత్ అంచనాలు తారుమారయ్యాయని అన్నాడు. వంశీ బయటకు వెళ్లిపోతాడని, షాలిని హౌస్‌లోనే ఉంటుందని కొందరు భావించారని.. కానీ వంశీ ముందుగా సేవ్ కావడంతో వారి అంచనాలు తప్పాయని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన వంశీ.. తనకంటే ముందే రోహిత్ బయటకు వెళ్లే అవకాశం ఉందని, హౌస్‌లో ఉండటానికి తనకే ఎక్కువ అర్హత ఉందని నమ్ముతున్నట్లు చెప్పాడు. మరోవైపు త్రిగుణ్ దగ్గర ఉన్న వర్షిణి.. తన ఆట గురించి నీతూ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేసింది. నిజానికి తనను, వంశీని నామినేట్ చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో రోహిత్ నిర్ణయాన్ని మార్చుకున్నాడని వర్షిణి ఆరోపించింది. వంశీ ఎలిమినేట్ అవుతాడనే అంచనాతో ఉన్న రోహిత్‌కు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో అసహనం పెరిగిందని అభిప్రాయపడింది. మరోవైపు రోహిత్‌తో మాట్లాడిన సుధీర్.. షాలిని హౌస్ నుంచి వెళ్లిపోవడంతో ఇప్పుడు తన ఆటను మరింత బలంగా ఆడేందుకు ఇదే సరైన సమయమని సూచించాడు. ఇకపై వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాలని చెప్పాడు.

దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. తాను కూడా అదే ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. హౌస్‌లో కోల్పోవడానికి తన దగ్గర ఏమీ లేదని, ఇకపై పూర్తి దూకుడుతో ఆడతానని స్పష్టం చేశాడు. అయితే షాలిని వెళ్లిపోవడం తనకు సంతోషకరమైన విషయం కాదని, ఆమె తనకు మానసికంగా బలాన్నిచ్చే వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదట అమన్.. శివ్‌ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్ అంటూ హౌస్‌లోకి వచ్చిన కొందరు, చివరకు వైల్డ్ ఫూల్స్‌గా మారిపోయారని విమర్శించాడు. కేవలం గంటసేపు ఎపిసోడ్ చూసి వచ్చారని, 24 గంటల ఫుటేజ్ చూసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. దీనికి శివ్ గట్టిగానే సమాధానమిచ్చాడు. బయట ప్రేక్షకులు కూడా 24 గంటల ఫుటేజ్ చూడరని, గంటసేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ ఆధారంగానే ఓట్లు వేస్తారని గుర్తుచేశాడు. ఫూల్స్ ఎవరో ప్రేక్షకులే నిర్ణయిస్తారని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన మరింత ముదిరింది. అమన్ మాట్లాడుతూ.. శివ్ ఇతరుల మధ్య గొడవలు పెట్టి పక్కకు తప్పుకుంటాడని, ఇదంతా గేమ్ ప్లాన్‌లా అనిపిస్తోందని ఆరోపించాడు. అయితే శివ్ మాత్రం అందరితో సన్నిహితంగా ఉండాలనుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశాడు.

ఈసారి శ్వేత అనూహ్యంగా త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. మొదట్లో త్రిగుణ్ ఆటతీరుపై తనకు మంచి అభిప్రాయం ఉండేదని, అతను ఫ్రంట్ ఫుట్‌లో ఆడతాడని అనుకున్నా చెప్పింది. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని వెల్లడించింది. కప్పు గెలవాలనే లక్ష్యంతో ఆడే వ్యక్తి నమ్మకద్రోహానికి పాల్పడకూడదని, గేమ్‌లో ఛీటింగ్ చేసి కెప్టెన్సీ కంటెండర్ల జాబితా నుంచి ఇతరులను తొలగించడం సరైన పద్ధతి కాదని ఆరోపించింది. అందుకే త్రిగుణ్‌ను నామినేట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి త్రిగుణ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తన ఇమేజ్ దెబ్బతింటోందని తనకు తెలుసని, అయితే హీరోగా పేరు తెచ్చుకోవడానికో, విలన్‌గా ముద్ర వేయించుకోవడానికో తాను రాలేదని చెప్పాడు. హౌస్‌లో ఉన్నంతకాలం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

నామినేషన్లలో మరో ఆసక్తికరమైన పరిణామం వర్షిణి, నీతూ మధ్య చోటుచేసుకుంది. నీతూను నామినేట్ చేసిన వర్షిణి.. తనపై ఆరోపణలు చేసే ముందు ఆమె కూడా అదే నియమాలను పాటిస్తున్నారా అని ప్రశ్నించింది. బయటి విషయాలను హౌస్‌లో చర్చించకూడదని చెప్పే నీతూ, తాను మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వర్షిణి విమర్శించింది. రూల్స్ పాటించడం లేదని తనను ప్రశ్నించే ముందు, ఇతరుల ప్రవర్తనను కూడా పరిశీలించాలని సూచించింది. ముకేష్‌ను పక్కన పెట్టుకుని గేమ్ ఆడుతున్నానని ఆరోపించిన నీతూకు.. తన ఆట గురించి ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారని వర్షిణి నిలదీసింది. అంతేకాకుండా నీతూ వైల్డ్ ఫైర్ కాదని, హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి రోహిత్, షాలిని మధ్య గొడవలు పెరగడానికి కారణమైందని కామెంట్స్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య వాదన మరింత వేడెక్కింది.

ఆ తర్వాత సుధీర్.. రామకృష్ణను నామినేట్ చేశాడు. అయితే ఈ సందర్భంగా రామకృష్ణ ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. అమాయకంగా మాట్లాడుతూనే గట్టిగా బదులిచ్చాడు. మరోవైపు త్రిగుణ్.. సుధీర్‌ను నామినేట్ చేస్తూ కుటుంబంపై ప్రమాణం చేసి మాట తప్పాడని ఆరోపించాడు. అతనిది కన్నింగ్ గేమ్ అని, అలాంటి వ్యక్తి హౌస్‌లో ఉండకూడదని వ్యాఖ్యానించాడు. దీనికి సుధీర్ కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ రూల్స్‌తో పాటు త్రిగుణ్‌ను నమ్మకూడదని కూడా చెబుతూ వస్తున్నానని గుర్తుచేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎథిక్స్ గురించి మాట్లాడటం పెద్ద బ్లఫ్‌లా ఉందని కౌంటర్ ఇచ్చాడు. ఇక రామకృష్ణ.. ఝాన్సీని నామినేట్ చేస్తూ అగ్నిపరీక్షలో బాగా ఆడినప్పటికీ బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటను నిరూపించుకోలేకపోయిందని విమర్శించాడు. సింపతీ గేమ్ ఆడుతోందని, చిన్న విషయాలకే ఏడుస్తోందని వ్యాఖ్యానించాడు. ఏడవడం ఎమోషన్ అయితే, కాళ్లు మొక్కడం కూడా ఎమోషనే కదా అంటూ ప్రశ్నించాడు.

అయితే ఈ సందర్భంగా ఝాన్సీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హౌస్‌లో త్రిగుణ్ చేసిన తప్పుల వల్లే చాలామంది బాధపడ్డారని, అతను చేసిన తప్పులతో పోలిస్తే ఇతరుల తప్పులు తక్కువేనని అభిప్రాయపడింది. త్రిగుణ్ కాళ్లు మొక్కనప్పుడు, ఇతరులు ఎందుకు అలా చేయాలని ప్రశ్నించింది. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. ఇతరుల మధ్య గొడవలు జరుగుతుంటే తనను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఇక ముకేష్.. వంశీని నామినేట్ చేశాడు. అనంతరం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్.. కెప్టెన్ రామ్ ప్రసాద్‌కు ప్రత్యేక అధికారాన్ని ఇచ్చాడు. నామినేషన్ల నుంచి తప్పించుకున్న నరేష్, దేబ్జానీ, అమన్, ముకేష్‌లలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని సూచించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రామ్ ప్రసాద్.. అమన్‌ను నామినేట్ చేశాడు. తన నిర్ణయాలను తానే స్వతంత్రంగా తీసుకోవాలని, హోస్ట్ కూడా ఇదే విషయాన్ని సూచించారని అమన్‌కు చెప్పాడు. దీంతో అమన్‌కు ఈ నామినేషన్ ఊహించని షాక్‌గా మారింది. మొత్తంగా ఏడో వారం నామినేషన్ల ప్రక్రియలో దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ (ఆర్కే), శివ్, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ మసూద్ నామినేట్ అయ్యారు. మరి ఈ 12 మందిలో ఎవరు ప్రేక్షకుల ఓట్లతో సేఫ్ అవుతారు.? ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.?ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us