AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanupriya: ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు.. కారణం ఇదే.. హీరోయిన్ భానుప్రియ కామెంట్స్..

సీనియర్ నటి భానుప్రియ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించి ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత సహాయ నటిగా అలరించింది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో భాను ప్రియ మాట్లాడుతూ తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఛత్రపతి చిత్రం తర్వాత తెలుగు సినిమాలకు దూరమవడానికి గల కారణాలను, బాలీవుడ్‌లో ఎదుర్కొన్న భాషా సవాళ్లను వివరించారు. డబ్బింగ్ అనుభవాలు, తెలుగులో మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి గురించి చెప్పుకొచ్చారు.

Bhanupriya: ఛత్రపతి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు.. కారణం ఇదే.. హీరోయిన్ భానుప్రియ కామెంట్స్..
Bhanupriya
Rajitha Chanti
|

Updated on: May 04, 2026 | 11:59 AM

Share

సీనియర్ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, బాలీవుడ్ అనుభవాలు, డబ్బింగ్ ప్రయాణం, బరువు పెరగడానికి గల కారణాలపై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తెలుగులో భానుప్రియ కెరీర్ విజయవంతంగా సాగింది కానీ, హిందీలో మాత్రం ఆశించినంత విజయం లభించలేదని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్‌లో చేసిన చాలా సినిమాలు ఫ్లాప్‌లయ్యాయని, ఖుద్గర్జ్ వంటి హిట్‌ చిత్రాల్లో కూడా తన పాత్ర నిడివి చాలా తక్కువ అని ఆమె తెలిపారు. ఆ సమయంలో తెలుగు సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించానని, హిందీకి వెళ్లిన తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గాయని చెప్పారు. బాలీవుడ్‌లో ఎక్కువ డేట్స్, ముంబైలో నివాసం ఉండాల్సి రావడం కష్టంగా ఉండేదని వివరించారు. అయితే బాలీవుడ్‌లో తన మొదటి సినిమా దోస్తీ దుష్మనీలో నటుడు జితేంద్ర తనను ఎంతగానో ప్రోత్సహించారని భానుప్రియ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో హిందీ భాష సరిగా రాకపోవడంతో డైలాగ్స్‌ను రాసుకుని చదివేదాన్నని, జితేంద్ర సెట్స్‌లో ఎంతో స్ఫూర్తినిచ్చేవారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

డబ్బింగ్ విషయానికొస్తే, కెరీర్ ప్రారంభంలో లక్ష్మి, దుర్గ వంటి డబ్బింగ్ ఆర్టిస్టులు తన పాత్రలకు గాత్రం అందించేవారని భానుప్రియ చెప్పారు. సరిత అమెరికా అబ్బాయి సినిమాకు డబ్బింగ్ చెప్పారని తెలిపారు. అప్పట్లో తన వాయిస్ సన్నగా ఉండడం, మాడ్యులేషన్స్, ఎమోషన్స్ సరిగా పలకకపోవడంతో డబ్బింగ్ చెప్పడానికి పిలిచేవారు కాదని అన్నారు. అయితే, అన్వేషణ చిత్రం నుండి స్వయంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించానని వెల్లడించారు. దర్శకుడు వంశీ తన నిర్ణయానికి అంగీకరించారని, వాయిస్ టెస్ట్ అనంతరం డబ్బింగ్‌కు ఓకే చేశారని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

ఛత్రపతి చిత్రం సమయంలో, ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు తాను చాలా బరువు పెరిగినట్లు భానుప్రియ తెలిపారు. దీనికి ప్రధాన కారణం తన కుమార్తె అని, ఆమె తన ప్రపంచమని అన్నారు. కుమార్తెను చూసుకోవడం, ఆమెకు ఆహారం తినిపించడం వంటి పనుల వల్ల తన గురించి తాను పట్టించుకోలేదని, వ్యాయామం చేయలేదని తెలిపారు. ఆ దశలో తాను చాలా రిలాక్స్‌గా ఉన్నానని, మాతృత్వం తనకు ఉత్తమమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. బరువు పెరగడం వల్ల చాలా అవకాశాలను కూడా వదులుకున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం తన కుమార్తె తనను సినిమాల్లో నటించమని ప్రోత్సహిస్తుందని, చెన్నైలో షూటింగ్ అయితే ఇంటికి తిరిగి రావడం సులభమని కూడా చెబుతుందని తెలిపారు. తెలుగులో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని భానుప్రియ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Follow Us
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్