AR Rahman: అమీన్ పీర్ దర్గాను సందర్శించిన ఎఆర్ రెహమాన్

| Edited By: Rajeev Rayala

Nov 17, 2024 | 4:34 PM

కడపలో ప్రతి ఏట జరిగే ఉరుసు మహోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఈ ఏడాది కూడా ఆయన కడప పెద్ద దర్గాలో గంధం ఉత్సవంలో పాల్గొన్నారు

AR Rahman: అమీన్ పీర్ దర్గాను సందర్శించిన ఎఆర్ రెహమాన్
Ar Rehaman
Follow us on

కడప జిల్లాలోని  పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ప్రతి ఏటా నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉర్సు ఉత్సవం ఎక్కడా చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో హజరత్ ముస్తాన్ సాహెబ్ కు సంబంధించిన ముజావర్లో గంధం ఉత్సవం జరుగుతుంది. ఎందుకంటే ఈయన దాదాపు 60 ఏళ్ల పైబడి తపస్సు చేసి అతీత శక్తులు పొందారు అనేది ఇక్కడ వారి నమ్మకం. అందుకే కడప అమీన్ పీర్ దర్గాలో మొత్తం 12 ముజావర్లు ఉన్నప్పటికీ అందులో ముస్తాన్ సాహెబ్‌లో జరిగే ఉర్సు చాలా ప్రధానమైనదిగా చెప్పుకుంటారు. ఈయన తపస్సు చేస్తుండగా గుహలోకి ఒక మేకల కాపరి వెళ్లి పరిశీలించగా.. ఈయన బయటపడతాడు. ఆ తర్వాత ఆయనను దీనిపై ప్రశ్నించగా సాహెబ్ చెప్పినవన్నీ జరిగాయట. అందుకే ఈయనను ప్రధాన ముజావర్గా చెప్పుకుంటారు.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

ఇప్పటివరకు 11 మంది పీఠాధిపతులు అమీన్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 11వ జాతికి చెందిన ముజావర్లు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. అయితే కడప అమీన్ పీర్ దర్గాకు ప్రముఖ విద్వాంసుడు ఏ.ఆర్ రెహమాన్ కూడా వస్తుంటారు.ఈ ఏడాది కూడా  ఏ ఆర్ రెహమాన్ హాజరయ్యారు. రెహమాన్ మాత్రమే కాదు అనేకమంది భక్తులు ఇక్కడకు వచ్చి తమ కోరిన కోర్కెలను తీర్చుకొని వెళుతూ ఉంటారు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

అంతేకాకుండా ఇప్పటికే  చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు వీళ్లంతా కూడా కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలలో సంగీత విద్వాంసుడు రెహమాన్ పాల్గొంటారు. అలాగే ఈఏడాది కూడా ఆయన ఇక్కడకు హాజరయ్యారు.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.