Pawan Kalyan: తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్ వైరల్

|

Oct 07, 2024 | 8:41 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కల్యాణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు లు తీసుకున్నారు.

Pawan Kalyan: తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్ వైరల్
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కల్యాణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు లు తీసుకున్నారు. పవన్ వెంట ఆయన ఇద్దరి కూతుళ్లు, ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,తమ్.. ఇలా పలువురు ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఆనంద్ సాయి పవన్ వెంటే ఉన్నారు. అలిపిరి మొదలు శ్రీవారి దర్శనం అయ్యే దాకా డిప్యూటీ సీఎం వెంటే ఉండి పవన కు సహాయ సహకారాలు అందించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఇవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఒక్క ఫొటో మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫొటో. పవన్ కల్యాణ్ తన లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటో కావడంతో ఇది అభిమానులకు మరింత స్పెషల్ గా మారింది. ఆనంద్ సాయి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా క్షణాల్లోనే వైరల్ గా మారింది.

పవన్ కల్యాణ్, ఆనంద్ సాయిల మధ్య మంచి స్నేహం ఉంది. తొలి ప్రేమ సినిమ కంటే ముందే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే ఈ ఇద్దరూ ఎక్కువగా కలిసి కనిపిస్తారు. ఇక పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆనంద్ సాయి తరచుగా పవన్ ని కలుస్తున్నారు. ఇందులో భాగంగాన ఇద్దరూ తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ సాయి, త్రివిక్రమ్ లతో పవన్..

ఇక త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ ల ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జల్సాతో మొదలైన వీరి స్నేహ బంధం అత్తారింటికి దారేది సినిమాతో మరింత బలంగా మారింది. ఆ తర్వాత కూడా పవన్ నటించిన పలు సినిమాలకు పని చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా తిరుమలలో పవన్‌ ను కలిసి సరదాగా ముచ్చటించారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ వెంట ఆనంద్ సాయి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..