Kavya Maran-Anirudh: అనిరుధ్ పెళ్లిపై 10 ఏళ్ల క్రితం జోస్యం.. 100% నిజమైంది! వైరలవుతోన్న ఈ వీడియోను చూశారా?

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్‌ల వివాహం నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో, పదేళ్ల క్రితం టారో కార్డుల ద్వారా అనిరుధ్- కావ్యలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Kavya Maran-Anirudh: అనిరుధ్ పెళ్లిపై 10 ఏళ్ల క్రితం జోస్యం.. 100% నిజమైంది! వైరలవుతోన్న ఈ వీడియోను చూశారా?
Anirudh Ravichander And Kavya Maran Wedding

Updated on: Oct 19, 2026 | 12:15 PM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌లు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కావడంతో ప్రముఖులందరినీ స్వయంగా కలిసి కావ్య- అనిరుధ్ ల పెళ్లి పత్రికలు అందజేస్తున్నారు. అనిరుధ్ – కావ్య ల వివాహం నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. ఇందులో భాగంగానే సన్ గ్రూప్ అధినేత కళనిధి మారన్, కావేరి మారన్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా ఈ వివాహానికి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సుమారు పదేళ్ల క్రితం ఓ టీవీ కార్యక్రమంలో టారో కార్డ్ రీడర్ చేసిన జోస్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. అనిరుధ్ కాబోయే భార్య గురించి అప్పట్లో చెప్పిన కొన్ని విషయాలు కావ్య మారన్ జీవితానికి దగ్గరగా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు అప్పట్లో ఏం జరిగింది?

తమిళ టెలివిజన్ ఛానల్ తంతి టీవీలో ప్రసారమైన నట్పుడన్ అప్సరా కార్యక్రమంలో టారో కార్డ్ రీడర్ జయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అప్సరా రెడ్డి హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో అనిరుధ్ భవిష్యత్తు, వివాహం గురించి జయశ్రీ ఆసక్తకర విషయాలు పంచుకున్నారు. అనిరుధ్‌కు కాబోయే జీవిత భాగస్వామి టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్ లేదా మీడియా రంగాలకు సంబంధించిన అమ్మాయి అని ఆమె అప్పట్లోనే అంచనా వేశారు. అంతేకాకుండా, ఆ యువతి చాలా విద్యావంతురాలు, తార్కిక ఆలోచనాపరురాలుగా ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక ఆ అమ్మాయి ఇల్లు అనిరుధ్ ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని కూడా చెప్పారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలోని అంచనాలను కావ్య మారన్ నేపథ్యంతో పోలుస్తూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కావ్య మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. దీంతో మీడియా రంగానికి చెందిన వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు అనే అంశాలు కావ్యకు సరిపోతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, అనిరుధ్‌కు ప్రేమ వివాహం జరుగుతుందని, తన భవిష్యత్తు జీవిత భాగస్వామిని ఓ పార్టీలో కలుసుకునే అవకాశం ఉందని కూడా టారో రీడర్ చెప్పారు. ఆమె కుటుంబ నివాసం అనిరుధ్ ఇంటికి దగ్గరగా ఉంటుందని చెప్పిన అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మొత్తానికి, అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ వార్తలతో పాటు పదేళ్ల నాటి టారో కార్డ్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ జంట వివాహానికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్?

అనిరుధ్, కావ్య మారన్ వివాహానికి సంబంధించి నవంబర్ 21, 2026న చెన్నైలో రిసెప్షన్ జరగ నుంది. ఇక నవంబర్ 11న గ్రీస్‌లో ప్రైవేట్ వేడుకగా వివాహం జరగవచ్చని కొన్ని కథనాలు పేర్కొంటున్నప్పటికీ, ఆ తేదీ, వేదికకు సంబంధించి జంట నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us