AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Sreemukhi: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్.. ఎంత ఖర్చయ్యిందంటే?

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. ఓ పక్క టీవీ షోస్, సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ బుల్లితెర రాములమ్మ. అలాగే బిజినెసుల్లోనూ రాణిస్తూ బాగానే సంపాదిస్తోందీ ముద్దుగుమ్మ.

Anchor Sreemukhi: కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్.. ఎంత ఖర్చయ్యిందంటే?
Anchor Sreemukhi
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 7:58 PM

Share

స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, వాక్చాతుర్యంతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తోందీ బుల్లితెర రాములమ్మ. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ప్రస్తుతం ఈ అందాల యాంకరమ్మ టీవీ షోస్ తో పాటు సినిమా ఈవెంట్లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోంది. వీటితో పాటు అదనంగా పలు వ్యాపారాలను కూడా ప్రారంభించిందీ స్టార్ యాంకర్. ఇక సోషల్ మీడియాలోనూ భారీగా ఆదాయం ఆర్జిస్తోందీ అందాల యాంకరమ్మ. మొత్తానికి ప్రొఫెషనల్ కెరీర్ పరంగా నిత్యం బిజీ బిజీగా ఉంటోంది శ్రీముఖి. ఇదే క్రమంలో ఆస్తులు కూడా భారీగానే కూడబెట్టిందని సమాచారం. ఇప్పటికే హైదరాబాదులో ఆమెకు సుమారు మూడు లగ్జరీ ఇళ్లు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా దీపావళి పండగను పురస్కరించుకుని శ్రీముఖి మరో ఖరీదైన లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు శ్రీముఖికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళి పండుగ సందర్భంగా శ్రీముఖి ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు చేసి తమ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె వెంట తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాగా శ్రీముఖి తన ఇంటిని అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారని తెలుస్తోంది. కాగా విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఇంటి కోసం శ్రీముఖి బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా శ్రీముఖి ఇప్పుడు టాప్ మోస్ట్ యాంకర్. ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. బుల్లితెర కార్యక్రమాలతో మాత్రమే కాకుండా బిజినెస్ వ్యవహారాలు అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా శ్రీముఖి భారీగా సంపాదిస్తోంది. ఇలా ప్రతి నెల లక్షల్లోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఆస్తులను కూడబెడుతోంది.

నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో యాంకర్ శ్రీముఖి..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

తల్లిదండ్రులతో యాంకర్ శ్రీముఖి..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన యాంకర్‌ శ్రీముఖి.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏది? రాయల సభలో తెనాలి చిక్కుముడి
ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏది? రాయల సభలో తెనాలి చిక్కుముడి
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..
బ్రిటన్ పార్లమెంట్‌లో తొలిసారి హనుమాన్ చాలీసా పఠనం.. దీపావళి..
మైనర్ బాలికతో చాటింగ్.. యువకుడిపై బాలిక తండ్రి, బంధువుల దాడి
మైనర్ బాలికతో చాటింగ్.. యువకుడిపై బాలిక తండ్రి, బంధువుల దాడి
ఆ పెద్ద నటుడు నన్ను అసభ్యకరంగా తాకాడు..
ఆ పెద్ద నటుడు నన్ను అసభ్యకరంగా తాకాడు..
ఇంట్లో వేప చెట్టు ఉంటే ఏమౌతుంది..? వాస్తు ప్రకారం ఆ దిశలో నాటితే
ఇంట్లో వేప చెట్టు ఉంటే ఏమౌతుంది..? వాస్తు ప్రకారం ఆ దిశలో నాటితే
ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి వేడుకలు.. చిన్న జీయర్ స్వామి
ముచ్చింతల్‌లో వైభవంగా యతీంద్ర సప్తతి వేడుకలు.. చిన్న జీయర్ స్వామి
వేడి అన్నంలోకి ఈ ఒక్క కూర ఉంటే చాలు.. పల్లెటూరి స్టైల్‌లో చేయండి
వేడి అన్నంలోకి ఈ ఒక్క కూర ఉంటే చాలు.. పల్లెటూరి స్టైల్‌లో చేయండి
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..
కేరళ ఏనుగు పిల్ల 'మాయ'కు వంతారా ఊపిరి..