స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ కోరుతున్నారు. తాజాగా ఈ కేసుపై స్టార్ యాంకర్ అనసూయ స్పందించింది. బాధితురాలికి జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆమె లేడీ కొరియోగ్రాఫర్ కు న్యాయం జరగాలని కోరింది. ‘అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే బయటకు చెప్పాలి. మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలి. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటిని ధైర్యంగా ప్రతిఘటించాలి. మీకు అందరూ అండగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు. నేను బాధిత యువతితో కలిసి కొద్ది రోజులు వర్క్ చేశాను’.
‘పుష్ప’ సెట్స్ లో రెండు, మూడుసార్లు ఆ అమ్మాయిని చూశాను. కానీ తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఆ అమ్మాయికి మంచి ట్యాలెంట్ ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆ అమ్మాయి ట్యాలెంట్ ను ఏమాత్రం తగ్గించలేవు. కానీ, మనసులో దాచుకుని బాధ పడటం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు. నా వర్క్ ప్లేస్ లో తోటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే స్పందిస్తాను. వారికి మద్దతుగా నిలబడుతాను. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరగాలని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’ అని అనసూయ తెలిపింది.
అంతకు ముందు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్, ప్లే బ్యాక్ సింగర్ జానీ మాస్టర్ కేసుపై స్పందించారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరారు.
Accused ‘shaik jani’ should not be called a master anymore ,
Have some respect for the word ‘Master’ 🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2024
If you are a female singer / musician, please fill this form. This has been prepared by a Lawyer friend of mine with experience in POSH Units and is also a trainer – to better understand the challenges faced by musicians.
This form can be done filled out completely anonymously.…— Chinmayi Sripaada (@Chinmayi) September 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.