జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఏవైనా రాజకీయాలుంటే మీరు మీరు చూసుకోండని.. దయచేసి తనను, తన పిల్లలను ఇందులోకి లాగొద్దని కోరారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారామె. ప్రస్తుతం రేణూ దేశాయ్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పవన్ మాజీ సతీమణి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ అమ్మా రేణూ.. మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని’ అని ట్వీట్ చేశారు. కాగా పవన్ నటించిన తాజా సినిమా ‘బ్రో’లో పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారంటూ మంత్రి అంబటి గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి పవన్ సంబరపడుతున్నారంటూ మంత్రి అంబటి చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై తామూ సినిమాలు తీస్తామంటూ చెబుతున్నారు వైసీపీ నేతలు.
ఈ క్రమంలోనే రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘పవన్ కల్యాణ్ పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామంటూ చాలామంది. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమాలు, సిరీస్‌లు ఉంటాయంటున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి నా పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో పుట్టారు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను పాలిటిక్స్‌లోకి లాగొద్దు. రాజకీయాలేమైనా ఉంటే మీరూ మీరూ చూస్కోండి’ అని వైసీపీ నేతలకు హితవు పలికారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఆశయాలు చాలా గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజల కోసం పవన్ పనిచేయాలన్న తపన గొప్పది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు
మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !— Ambati Rambabu (@AmbatiRambabu) August 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..