Pushpa 2 Teaser: ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది.. అల్లు అర్జున్ మాస్ అవతార్ చూస్తే పూనకాలే

|

Apr 07, 2023 | 4:29 PM

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా.. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియో హైప్ పెంచేసింది.

Pushpa 2 Teaser: ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది.. అల్లు అర్జున్ మాస్ అవతార్ చూస్తే పూనకాలే
Pushpa 2 Teaser
Follow us on

ఇప్పుడు సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. గతంలో వచ్చిన ఈ సినిమా పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద ఏరెంజ్‏లో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్నారు బన్నీ.. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా.. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియో హైప్ పెంచేసింది. ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది బుల్లేట్ గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్.

వేర్ ఈజ్ పుష్ప.. హంట్ బిఫోర్ రూల్ అంటూ ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.