Allu Arjun: జస్ట్‌ 2 గంటల షూటింగ్‌.. 10 కోట్లు.. అభిమానుల కోసం భారీ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన అల్లు అర్జున్‌

|

Dec 14, 2023 | 8:33 PM

పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో బన్నీ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. అలాగే పలు ఉత్పత్తుల ప్రమోషన్లకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Allu Arjun: జస్ట్‌ 2 గంటల షూటింగ్‌.. 10 కోట్లు.. అభిమానుల కోసం భారీ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన అల్లు అర్జున్‌
Allu Arjun
Follow us on

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బన్నీ. ఆ తర్వాత ఇదే పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో బన్నీ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. అలాగే పలు ఉత్పత్తుల ప్రమోషన్లకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నారు . సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ రూ.10 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందట. ఒక కంపెనీ తమ యాడ్ షూట్‌ కోసం ఒక రోజులో జస్ట్ రెండు గంటలు కెమెరా ముందుకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతే చాలని, ఇందుకోసం దాదాపు రూ.10 కోట్ల వరకు చెల్లిస్తామని ఐకాన్‌ స్టార్‌కు ఆఫర్ చేశారు. అయితే బన్నీ మాత్రం సింపుల్‌గా చేయలేనని చెప్పాడట. ఎందుకంటే ఆ యాడ్‌ ఒక ఆల్కహాల్‌, పొగాకు బ్రాండ్‌కు సంబంధించినదట. అంతేకాదు ‘ఇలాంటి యాడ్స్ అసలు చేయను, నా అభిమానులు అవి చూసి వాటికి అలవాటు పడతారు’ అని సింపుల్‌గా ఆల్కహాల్‌ బ్రాండ్‌ యాడ్‌ను రిజెక్ట్‌ చేశాడట బన్నీ. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అల్లు అర్జున్‌ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ అతని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దటీజ్‌ అల్లు అర్జున్‌ అంటూ నెట్టింట పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

సదరు ఆల్కహాల్‌ కంపెనీ ప్రతినిధులు పుష్ప 2 చిత్ర బృందాన్ని కూడా కలిశారట. ‘పుష్ప 2’ సినిమాలో హీరో మద్యం తాగేటప్పుడు, స్మోక్‌ చేసేటప్పుడు తమ బ్రాండ్‌ని వాడేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అనుకున్నారట. రెండు సీన్లలో వారి బ్రాండ్ పేరు కనిపించేలా చూడాలని కోరారట. అయితే బన్ని ఇందుకు ససేమిరా ఒప్పుకోలేదట. ఇటీవల మద్యం, సిగరెట్, గుట్కా తయారీ కంపెనీలు వారి కంపెనీల పేర్లతో ప్రత్యామ్నాయ ప్రకటనలు రిలీజ్‌ చేస్తున్నాయి. వీటినే సింపుల్‌గా సరోగేట్‌ యాడ్స్‌ అంటారు. మద్యం, సిగరెట్, గుట్కా ఉత్పత్తులను నేరుగా ప్రచారం చేయలేరు కాబట్టి పరోక్ష మార్గాలను అన్వేషిస్తున్నారు.. గుట్కాకు బదులుగా పాన్ మసాలా, ఆల్కహాల్‌కు బదులుగా శీతల పానీయాల పేర్లు చెప్పి ప్రమోషన్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడిలాంటి ఆఫరే అల్లు అర్జున్‌కు వచ్చిందట. అయితే బన్నీ మాత్రం వెంటనే రిజెక్ట్‌ చేశాడట. అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం బన్నీ పూర్తి ఫోకస్ ‘పుష్ప 2’ సినిమాపైనే ఉంది. ఈ చిత్రంలో అతనికి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కన్నడ నటుడు డాలీ ధనంజయ్, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

h3>పుష్ప 2 సెట్ లో అల్లు అర్జున్, సుకుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.