Allu Arjun: ఆ రికార్డ్ అల్లు అర్జున్‏కే సొంతం.. సౌత్ ఇండియాలనే ఫస్ట్ హీరోగా బన్నీ రికార్డ్..

|

Mar 21, 2024 | 3:55 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన బన్నీ.. కొన్నాళ్లుగా పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు కేవలం బన్నీ ఫస్ట్ లుక్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇందులో బన్నీ పాత్ర మరింత పవర్ ఫుల్... సరికొత్తగా ఉండనుందనే ప్రచారం వినిపిస్తుంది.

Allu Arjun: ఆ రికార్డ్ అల్లు అర్జున్‏కే సొంతం.. సౌత్ ఇండియాలనే ఫస్ట్ హీరోగా బన్నీ రికార్డ్..
Allu Arjun
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్నారు. దీంతో ఆయనకు ఇటు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు అయ్యారు. ఇప్పుడు ఆయన సినిమాలపై మరింత పైప్ ఏర్పడింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన బన్నీ.. కొన్నాళ్లుగా పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు కేవలం బన్నీ ఫస్ట్ లుక్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇందులో బన్నీ పాత్ర మరింత పవర్ ఫుల్… సరికొత్తగా ఉండనుందనే ప్రచారం వినిపిస్తుంది. అటు సోషల్ మీడియాలో నిత్యం పుష్ప 2కు సంబంధించిన అప్డేట్స్ గురించి చర్చలు నడుస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ నెట్టింట సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

గతంలో అల్లు అర్జున్ ఇన్ స్టా లో 20 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డ్ సెట్ చేశాడు బన్నీ. ఇక ఇప్పుడు తన రికార్డ్ తానే బద్దలు కొట్టి మరో రికార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్స్ కు చేరింది. అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది బన్నీని ఫాలో అవుతున్నారు. దీంతో సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్స్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సెట్ చేశాడు. ఈ విషయంపై బన్నీ స్పందిస్తూ 25 మిలియన్స్.. అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇక అల్లు అర్జున్ కొత్త రికార్డ్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా బన్నీకి విషెస్ తెలిపాడు. వెల్ డన్ లెజెండ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. అలాగే కోలీవుడ్ సెన్సెషన్ అట్లీ డైరెక్షన్లో బన్నీ ప్రాజెక్ట్ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.