Allu Arjun: మరోసారి కోర్టుకు అల్లు అర్జున్ లాయర్స్.. ఎందుకంటే..

|

Dec 14, 2024 | 8:09 AM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. కాసేపటి క్రితమే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు బన్నీ. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కీలకవ్యాఖ్యలు చేశారు. తాము మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

Allu Arjun: మరోసారి కోర్టుకు అల్లు అర్జున్ లాయర్స్.. ఎందుకంటే..
Allu Arjun Lawyers
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం హైకోర్టు మధ్యంతర బెయిల్ కాపీని జైలు సూపరింటెండ్ కు అందజేయడంతో ఆ వెంటనే విడుదల ప్రక్రియను ప్రారంభించారు పోలీసులు. అలాగే రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు అల్లు అర్జున్ న్యాయవాదులు. అప్పటికే చంచల్ గూడ జైలు వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు చేరుకోవడంతో బన్నీని వెనుక గేటు నుంచి బయటకు పంపించారు పోలీసులు. అనంతరం తన తండ్రితో కలిసి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ పలువురు దర్శకనిర్మాతలు బన్నీని పరామర్శించారు. మరోవైపు బన్నీ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ ఇంటి వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ కీలకవ్యాఖ్యలు చేశారు. నిజానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందచేశామని.. కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదని అన్నారు. ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్తామని.. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచుకోవడానికి వీల్లేదని.. కానీ ఉద్దేశ్య పూర్వకంగా బన్నీని రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లానున్నామని అన్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయని.. అందుకే అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..

డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతోనే అల్లు అర్జున్ రాత్రాంతా జైలులో ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.