Allu Arjun: అల్లు అర్జున్ విడుదల.. తండ్రి కోసం అర్హ ఎదురుచూపులు.. వీడియో..

|

Dec 14, 2024 | 7:52 AM

సినీనటుడు అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం జైలుకు వెళ్లిన బన్నీ దాదాపు 12 గంటలపాటు జైలులో ఉన్నారు. నిన్న రాత్రి బెయిల్ ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు అల్లు అర్జున్. ఈరోజు తెల్లవారుజామునే బన్నీ బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను వెనుక గేటు నుంచి బయటకు పంపించారు పోలీసులు.

Allu Arjun: అల్లు అర్జున్ విడుదల.. తండ్రి కోసం అర్హ ఎదురుచూపులు.. వీడియో..
Allu Arjun, Allu Arha
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 6.39 నిమిషాలకు చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన భార్య, పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్ గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు అల్లు అర్జున్.

అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్ 1 రూంలో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేటు ముందు ఫ్యాన్స్, మీడియా ఉండడంతో వెనక గేటు నుంచి బన్నీని బయటకు పంపించారు పోలీసులు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం తెల్లవారుజాము నుంచే ఎదురుచూస్తుంది అర్హ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ రచయిత చిన్న కృష్ణ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమని అన్నారు రచయిత చిన్నికృష్ణ. తెలంగాణ ప్రభుత్వం కక్షతోనే ఈ అరెస్టు చేసిందని.. ఈ అరెస్టుపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం.. గంగోత్రి సినిమాకి నేనే రచయితను అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.